Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
Ankapur Chicken: అంకాపూర్ చికెన్.. అట్లుంటది మళ్లా
Ankapur Chicken: చికెన్ అందరికీ ఇష్టమే. అయితే కొంతమందికి కోడి పులుసు ఇష్టం ఉంటే.. మరి కొందరికి మాత్రం కోడి మాంసాన్ని ఇష్టంగా తింటారు. చాలా మంది బాయిలర్ కోడి మాంసాన్ని రకరకాలుగా వండుకుంటారు. మరికొందరేమో నాటు కోళ్లతో చేసే వంటకాన్ని ఇష్టపడతారు.

అయితే నాటుకోడి కూరకు పర్యాయపదంగా మారింది అంకాపూర్ చికెన్ కర్రీ. అంకాపూర్ చికెన్ కర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి అంకాపూర్ చికెన్ గురించి తెలిసే ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉంటుంది అంకాపూర్ గ్రామం. ఇక్కడి నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చికెన్ కర్రీ పార్శిళ్లు వెళ్తుంటాయి. వారాంతాల్లో అంకాపూర్ చికెన్ కు మరింత డిమాండ్ పెరుగుతుంది.

అంకాపూర్ చికెన్ కు కావాల్సిన పదార్థాలు:
* నాటుకోడి - కిలో
* ఉల్లిపాయలు
* అల్లం వెల్లుల్లి పేస్టు
* ధనియాల పొడి
* కరివేపాకు
* పసుపు
* ఎండు కొబ్బరి పొడి
* పల్లి నూనె
* మసాలా
* మెంతి
* బిర్యానీ ఆకులు

తయారీ విధానం:
1. నాటుకోడికి పసుపు రాసి మంటపై కాల్చాలి. తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కులకు అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, మసాలాలు, పసుపు వేసి కలపాలి.

2. గిన్నెలో నూనె వేడి చేసుకుని బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, మెంతి, కరివేపాకు వేసుకోవాలి. కాసేపటి తర్వాత అది గిన్నెలో ముందుకు కలిపి పక్కన పెట్టుకున్న నాటుకోడి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి.

3. ముక్కలు ఉడుకుతున్నప్పుడే కొబ్బరి పొడి, మసాలా వేసుకుని చక్కగా ఉడికిన తర్వాత దించేసుకోవడమే.
నోరూరించే అంకాపూర్ స్టైల్ చికెన్ కర్రీ సిద్ధం అయినట్లే. అన్నంలో వేడి వేడి నాటుకోడి కూర వేసుకుని మధురమే.



Click it and Unblock the Notifications