Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు
ఎండాకాలంలో వచ్చిందంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేవి మామిడి, పుచ్చకాయ, తాటి ముంజలు లాంటి పండ్లు. రకరకాల పండ్లను మనం ఎంతో ఇష్టంగా తింటాం. కానీ మీరు ఎన్నడైనా లసోడా పండును రుచి చూశారా? చూడ్డానికి చిన్నగా, గుండ్రంగా, ఆకుపచ్చగా ఉండే ఈ పండుని ఇండియన్ బెర్రీ అని కూడా పిలుస్తారు.

పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉండే ఈ పండు, పండిన తర్వాత లేత పసుపు రంగులోకి మారుతుంది. ఇది లోపల కొద్దిగా జిగురుగా ఉంటుంది. మన భారతదేశంలో ముఖ్యంగా రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఇది విరివిగా కనిపిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచే ఈ అద్భుతమైన లసోడాను వేసవిలో ఊరగాయలు, చట్నీలు, కూరల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఏ నెలలో దొరుకుతుంది?
అన్ని పండ్లలాగా లసోడా ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండదు. దీని అద్భుతమైన రుచిని ఆస్వాదించాలంటే మనం వేసవి కాలం వరకు వేచి చూడాల్సిందే. ముఖ్యంగా మే, జూన్ నెలల్లో మాత్రమే ఇది మార్కెట్లో కనిపిస్తుంది. ఏడాదిలో కేవలం రెండు నెలల పాటు మాత్రమే దొరుకుతుంది కాబట్టి దీనిని అత్యంత అరుదైన పండుగా భావిస్తారు. అందుకే ఈసారి మీకు మార్కెట్లో ఎక్కడైనా లసోడా కనిపిస్తే అస్సలు వదిలిపెట్టకండి. వెంటనే ఇంటికి తెచ్చి కమ్మని పచ్చడి లేదా కూర వండుకుని ఆస్వాదించండి.
పోషకాల ఖజానా ఈ లసోడా
చూడ్డానికి చిన్నగా ఉన్నా, దీనిలో పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. లసోడా పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

లసోడా తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
యాంటీ ఆక్సిడెంట్ల గని
లసోడాలో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వకుండా యవ్వనంగా ఉంచడంతో పాటు, అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి.
జీర్ణక్రియకు దివ్యౌషధం
వేసవిలో జీర్ణ సమస్యలు సర్వసాధారణం. లసోడాలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను చురుకుగా మారుస్తుంది. పేగుల పనితీరును మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను సులభంగా నివారిస్తుంది.
శ్వాసకోశ సమస్యలకు చెక్
ఆయుర్వేదంలో లసోడాకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దగ్గు, గొంతు నొప్పి సమస్యల ట్రీట్మెంట్ లో దీనిని వాడతారు. దీనిలోని కఫాన్ని కరిగించే గుణాలు శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
శరీరంలో వాపుల నివారణ
లసోడా పండ్ల సారం వాపు నిరోధక లక్షణాలను కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. ఇది శరీరంలోని వాపులను, తేలికపాటి ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
కాలేయ సంరక్షణ
మన శరీరంలో అత్యంత కీలకమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో లసోడా అద్భుతంగా పనిచేస్తుందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
కేవలం పండ్లే కాదు, లసోడా ఆకుల్లో కూడా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్ పైన పోరాడే అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications