Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
దసరా స్పెషల్.. మటన్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలంటే?
దేశ వ్యాప్తంగా దసరా ఫీవర్ నెలకొంది. ఈ ప్రత్యేకమైన పండగకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండడంతో.. ప్రజలు షాపింగ్, డెకరేషన్స్ అంటూ తమ ప్రయత్నాలు మొదపెట్టారు. కొందరు పండగవేళ ఎలాంటి వంటలు చేయాలి, సరికొత్తగా స్పైసీగా ఎలా వండుకోవాలని వెతకడం మొదలుపెట్టేశారు. అలాంటి వారికోసం సరికొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాము. అదే తెలంగాణ స్పెషల్ మటన్ మసాలా కర్రీ. ఈ కూరను ఎలా చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే వివరాలు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
ఈ కర్రీని చేసుకునే విధానం తెలుసుకునే ముందు, ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు గురించి తెలుసుకుందాం. మసాలా కర్రీ కాబట్టి.. ఇందులో మసాలాల సంఖ్య కొంచెం అధికంగానే ఉంటుంది.
> కేజీ మటన్
> నాలుగు చెంచాల నూనె
> ఒక పెద్ద ఉల్లిగడ్డ
> రెండు చెంచాల కారం
> పావు చెంచా పసుపు
> ఒక కప్పు పెరుగు
> రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్
> ఒక చెంచా ధనియాల పొడి
> ఒక చెంచా గరం మసాలా పొడి
> తగినంత ఉప్పు
> నాలుగు చెంచాల కొబ్బరిపొడి
> రెండు చెంచాల గసగసాలు
> కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం:
మటన్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కొబ్బరిపొడి, గసగసాలను కొద్దిగా వేయించుకొని, మిక్సీలో వేసి ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి. ఆ ఉల్లిగడ్డ బంగారు వర్ణంలో మారేంత వరకు వేయించుకోవాలి. అనంతరం.. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, వాటికి సంబంధించిన పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి.
అనంతరం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ మటన్ ను ఆ మిశ్రమంలో వేసి.. అందులోనే కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవాలి. మిశ్రమం మొత్తం మటన్ కు బాగా పట్టేలా కలిపి, ఒక పదినిమిషాల పాటు సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. పది నిమిషాల తరువాత కుక్కర్ మూత తీసేసి, కర్రీలో పైన పేర్కొనబడిన మోతాదులో పెరుగు, ముందుగా చేసిపెట్టుకున్న కొబ్బరి పేస్ట్, గరం మసాలా కలుపుకొని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అనంతరం కర్రీకి సరిపడేంత నీళ్లు పోసుకొని.. కుక్కర్ మూత పెట్టేసి మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అనంతరం కుక్కర్ మూత తీసేసి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరి. వేడి వేడిగా, ఘుమఘుమలాడే మటన్ మసాలా కర్రీ సిద్ధమైనట్లే.



Click it and Unblock the Notifications