Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
మకర సంక్రాంతికి ఈ అప్పాలు లేకపోతే తెలంగాణ వారికి పండగ ఫీల్ రాదు
తెలంగాణ అంటే నోరూరించే పిండి వంటలు గుర్తుకు వస్తాయి. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, పంతగులు, రంగవల్లులు ఎన్ని ఉన్నా చాలా మంది ఇష్టమైనవి పిండి వంటలే. తెలంగాణలో పిండి వంటలు ఎంతో ఫేమస్. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి వచ్చిందంటే కొన్ని రకాల ప్రత్యేక పిండి వంటలు తయారు చేస్తుంటారు. అవి కేవలం సంక్రాంతికి మాత్రమే పరిమితం.

సకినాలు, గారెలు, బూరెలు, చేగోడీలు, రింగులు, అరిసెలు, కారప్పూస ఇలా ఎన్నో రకాల పిండి వంటలు సంక్రాంతికి చేసుకుంటారు. చాలా మంది తమ ఇళ్లల్లో కొన్ని రకాల పిండి వంటలను కేవలం సంక్రాంతికి మాత్రమే చేస్తుంటారు. అవి చేయకపోతే సంక్రాంతి అనే ఫీల్ రాదు. అంతలా అవి పండగలో భాగం అయిపోతుంటాయి.
సంక్రాంతికి తెలంగాణలో ఎలాంటి పిండి వంటలు చేస్తారు, ఎలాంటి పిండి వంటలను తెలంగాణ వాసులు ఎక్కువగా ఇష్టపడతారో ఇప్పుడు తెలుసుకుందాం.

సకినాలు:
సంక్రాంతి సకినాలు రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పాత బియ్యాన్ని గంట సేపు నానబెట్టి, పిండి పట్టుకోవాలి. నువ్వులు, ఓమా, జీలకర్ర, ఉప్పు సరిగ్గా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఓ క్లాత్‌పై సకినాలు వేసుకోవాలి. కొద్దిగా ఆరిపోయిన తర్వాత నెమ్మదిగా తీసి నూనెలో వేయించుకోవాలి.

అరిసెలు:
బియ్యం ఒకరోజు నానబెట్టి పిండి పట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో బెల్లం తురుము తీసుకుని పాకం పట్టుకోవాలి. నెయ్యి, ఏలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. ఆ పిండిని అరిసెలుగా వత్తుకోవాలి. వాటిని నూనెలో వేయించుకోవాలి.

గారెలు:
బియ్యం పిండి, జీలకర్ర, నువ్వులు, పల్లీలు, ధనియాలు, నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. ఆ పిండిని గారెల మిషన్‌తో వత్తుకోవాలి. అలా వత్తుకున్న గారెలను నూనెలో వేయించుకోవాలి.

చెగోడీలు:
బియ్యం, నువ్వులు, జీలకర్ర, వాము, కారం, ఉప్పు, నూనె, నీళ్లు పోసుకుని మెత్తగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చెగోడీలు తయారు చేసుకోవాలి. వాటిని నూనెలో వేయించుకోవాలి.

నువ్వుల లడ్డూ:
బెల్లం పాకం తయారు చేసుకోవాలి. వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, పుట్లాను బెల్లం పాకంలో వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని లడ్డూలుగా తయారు చేసుకోవాలి.

కజ్జికాయలు/గరిజెలు:
గోధుమ పిండిలో, ఉప్పు, నూనె వేసుకుని కలుపుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి, రవ్వా, కొబ్బరి పొడి, షుగర్, యాలకుల పొడి వేయించుకోవాలి. తర్వాత చపాతీ పిండిని పూరీగా వత్తుకుని అందులో స్టఫ్ వేసుకోవాలి. తర్వాత దానిని కజ్జికాయల షేపులో కట్ చేసుకోవాలి. వాటిని నూనెలో వేయించుకోవాలి.గరిజెలు లేదా కజ్జికాయలు సంక్రాంతి ప్రత్యేకం పిండి వంటలు.



Click it and Unblock the Notifications