Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
బొబ్బట్లు, బూరెలు, అరిసెలు.. సంక్రాంతికి ఆంధ్ర పిండివంటలు అదిరిపోవాల్సిందే
మకర సంక్రాంతికి ఆంధ్ర ప్రాంతాల్లో ఎలాంటి పిండి వంటలు చేస్తారు.. బొబ్బట్లు, బూరెలు, అరిసెలతో పాటు ఇంకా ఏమేం వంటకాలు సిద్ధం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి అంటే పిండి వంటలు. రకరకాల వంటకాలు సంక్రాంతికి వీనుల విందు చేస్తాయి. ఆంధ్ర ప్రాంతంలోని దాదాపు ప్రతి ఇంట్లో మకర సంక్రాంతికి రకరకాల పిండి వంటలు చేస్తుంటారు. సంక్రాంతి పండగను పిండి వంటలను వేరు చేసి చూడలేం. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైన పిండి వంటలు కనిపిస్తాయి. బొబ్బట్లు, బూరెలు, అరిసెలు, కజ్జికాయలు, పొంగలి ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే ఎన్నో పిండి వంటలు వస్తూనే ఉంటాయి.

మకర సంక్రాంతికి ఆంధ్ర ప్రాంతాల్లో ఎలాంటి పిండి వంటలు చేస్తారు.. బొబ్బట్లు, బూరెలు, అరిసెలతో పాటు ఇంకా ఏమేం వంటకాలు సిద్ధం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

చక్కెర పొంగలి:
బియ్యం, పెసరపప్పు, నెయ్యి వేసి ఎర్రగా వేయించుకోవాలి. అందులో నీళ్లు, పాలు పోసి దగ్గరగా ఉండికించుకోవాలి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటే చక్కెర పొంగలి రెడీ అయినట్టే.

బొబ్బట్లు:
బొబ్బట్లు ఆంధ్ర ప్రత్యేక వంటకమని చెప్పాలి. దాదాపు ప్రతి పండగకు బొబ్బట్లు చేసుకుంటారు. బొబ్బట్లు ఎంతో రుచిగా ఉంటాయి. కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతమనే చెప్పాలి.

కజ్జికాయలు:
సంక్రాంతి పండగకు ఎక్కువగా చేసుకునే పిండి వంటకం కజ్జికాయలు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ ప్రాంతాల్లోనూ కజ్జికాయలు చేస్తారు. కజ్జికాయలను గరిజెలు అని కూడా పిలుస్తారు.

నువ్వుల ఉండలు:
వీటిని నువ్వులు, బెల్లం కలిపి తయారు చేస్తారు. సంక్రాంతికి ప్రత్యేకంగా చేసే నువ్వుల ఉండలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మసాలా వడలు:
మసాలా వడలు అంటే ఎవరికైనా నోరూరాల్సిందే. డీప్ ఫ్రైడ్ క్రిస్పీ వడలు సాయంత్రం వేళ స్నాక్‌గా తీసుకుంటే బాగుంటాయి.

పూర్ణం బూరెలు:
పూర్ణం బూరెలను వివిధ చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కానీ ప్రతి చోట పూర్ణం బూరెలు చేసుకుంటారు. లోపల పప్పు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఉంచి బంతుల్లా తయారు చేస్తారు. వాటిని నూనెలో వెయిస్తారు.

చంద్రకాంతలు:
ప్రసిద్ధ ఆంధ్ర స్వీట్లలో చంద్రకాంతలు ఒకటి. సంక్రాంతి పండగకు తప్పనిసరిగా తినాల్సిన వంటకం చంద్రకాంతలు. ఇవి ఎంతో పోషక విలువలతో నిండి ఉంటాయి. చంద్రకాంతల ప్రత్యేక రుచికి ఎవరైనా ఫ్యాన్‌గా మారాల్సిందే.

అరిసెలు:
దక్షిణ భారత్‌లో ఎక్కువగా వినిపించే స్వీట్ అరిసెలు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అరిసెలు చేస్తారు. సంక్రాంతి ప్రత్యేక స్వీట్ అరిసెలు.

వెన్న అప్పాలు:
పెళుసైన ఆకృతి అత్యద్భుతమైన రుచి వెన్న అప్పాల సొంతం. వెన్న అప్పాలు నచ్చని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రా ప్రజలు వెన్న అప్పాలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ అప్పాలను సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేస్తారు.



Click it and Unblock the Notifications