Latest Updates
-
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.?
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
సాధారణంగా మన ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోసెలు గుర్తుకొస్తాయి. వాటిలోకి ఎప్పుడూ రొటీన్ గా చేసుకునే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తిని మీకు బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త భిన్నంగా, ఎంతో రుచికరంగా ఉండే కుంభకోణం కడప్ప ట్రై చేయండి.
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం ఇడ్లీ, దోసెలకే కాకుండా పూరీ, చపాతీల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. కుంభకోణం పెళ్లిళ్లలో వడ్డించే అసలైన కడప్పను మీ ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కుంభకోణం కడప్ప తయారీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - 1 కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
బంగాళదుంప - 1
పసుపు - పావు టీస్పూన్.
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
జీడిపప్పు - 10
నీళ్లు - తగినన్ని
నూనె - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 2
కల్పాసి (రాతి పువ్వు) - కొద్దిగా
అనాస పువ్వు (స్టార్ అనీస్) - 1
బిర్యానీ ఆకు - 1
సోంపు - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
టమాటో - 1
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
కుంభకోణం కడప్ప తయారీ విధానం
-ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు పెసరపప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. అందులో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, కొద్దిగా పసుపు, పొట్టు తీసి ముక్కలుగా కోసిన బంగాళదుంపను వేసి కుక్కర్ మూతపెట్టాలి. స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-కుక్కర్ చల్లారాక అందులోని బంగాళదుంప ముక్కలను విడిగా తీసి
మెత్తగా మ్యాష్ (గుజ్జులా) చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పును కూడా
గరిటెతో మెదుపుకోవాలి.
ఈలోపు ఒక మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి
తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకుని పక్కన
ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాగాక దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కల్పాసి (రాతి పువ్వు) వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
-ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.
-ఇప్పుడు టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు గుజ్జులా అయ్యాక ముందుగా మ్యాష్ చేసుకున్న బంగాళదుంపను వేసి కలపాలి. ఇందులో సుమారు 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును అందులో వేసి బాగా కలుపుకోవాలి.
-చివరగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి-జీడిపప్పు పేస్ట్ ను వేసి మరో రెండు నిమిషాల పాటు సన్నటి మంటపై ఉడకనివ్వాలి. గ్రేవీ కాస్త చిక్కబడ్డాక సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే కుంభకోణం కడప్ప రెడీ. వేడి వేడి ఇడ్లీ లేదా దోసెలపై ఈ కడప్పను వేసుకుని తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications