Latest Updates
-
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు!
మాటగాడే కాదు,మంచి వంటగాడు కూడా: ప్రధాని మోదీకి ఏమేం వంటలు వండటం వచ్చో తెలుసా?
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీలో, సభలలో ప్రసంగాలు ఇవ్వడం మనం తరచుగా చూస్తుంటాం. ఆయన మాట్లాడే అద్భుతమైన శైలి, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ఉత్సాహభరితమైన హావభావాలు ఎంతో మందిని ఆకట్టుకుంటాయి.
ఆయన తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా లేదా వివిధ ఇంటర్వ్యూల ద్వారా దేశ ప్రజలతో ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగా, తనకు భోజనం అంటే చాలా ఇష్టమని ప్రధాని మోదీ చెప్పడం మీరు వినే ఉంటారు. కానీ ప్రధానమంత్రి మోదీకి స్వయంగా వంట చేయడం అన్నా కూడా అంతే ఇష్టమన్న ఆసక్తికరమైన విషయం బహుశా మీకు తెలుసా?

నరేంద్రమోదీ మాటల మాంత్రికుడే కాదండోయ్.. ఆయన ఒక మంచి వంటగాడు కూడా. మరి ప్రధాని మోదీకి ఎలాంటి ఆహారం ఇష్టం? ఆయన ఏమేమి వండగలరు? అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
మోదీ ఆహారపు అలవాట్లు
పలు మీడియా రిపోర్ట్ ల ప్రకారం.. ప్రధాని మోదీ చాలా కఠినమైన,
క్రమశిక్షణతో కూడిన ఆహారపు నియమాలను పాటిస్తారు. ఆయన వయసులో కూడా అంత
చురుగ్గా ఉండటానికి కారణం ఆయన తీసుకునే ఆహారమే. ఆయనకు ఇంటి భోజనం అంటే
చాలా ఇష్టం. మసాలాలు ఎక్కువగా లేని, సాధారణమైన, పోషకవిలువలు ఎక్కువగా
ఉండే సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు.
ఆయన రోజువారీ ఆహారంలో పసుపు, పెరుగు తప్పనిసరిగా ఉంటాయి. అలాగే, హిమాలయాల్లో మాత్రమే లభించే కొండ పుట్టగొడుగులు తినడం అంటే ఆయనకు చాలా ఇష్టం.
అత్యంత ఇష్టమైన వంటకం
నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైన వంటకం మునగ పరాఠా. దీని గురించి ఆయన
స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పని ఒత్తిడి నుంచి సమయం
దొరికినప్పుడల్లా ఆయన కిచెన్ లోకి వెళ్లి కాస్త వంట
చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
అలా ఆయన ఎన్నోసార్లు తనకు ఇష్టమైన మునగ పరాఠాను స్వయంగా తయారు చేసుకున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగ పరాఠాను ఆయన వారానికి రెండు సార్లు తప్పకుండా తన డైట్ లో ఉండేలా చూసుకుంటారు.
ఇవి మాత్రమే కాకుండా మఖానా, మొలకలు, గుజరాతీ వంటకాలైన ఢోక్లా, ఖాండ్వీ, ఖాఖ్రాతో పాటు పప్పులు, కూరగాయలు, రోటీ, సూప్, ఇడ్లీ, దోశ, సగ్గుబియ్యం కిచిడీ వంటి వాటిని కూడా ఆయన ఎంతో ఇష్టంగా తింటారు.

వంట చేయడంపై ఉన్న మక్కువ..
ప్రధాని మోదీ తినడాన్ని ఎంతగా ఆస్వాదిస్తారో, స్వయంగా వండటాన్ని కూడా
అంతే ఆస్వాదిస్తారు. తాను RSS ప్రచారక్ గా ఉన్నప్పటి నుంచి
రాజకీయాల్లోకి ప్రవేశించే వరకు ఎన్నో ఏళ్లపాటు తన వంట తానే
చేసుకునేవారని ఆయన చాలాసార్లు చెప్పారు. తన జీవిత ప్రారంభ రోజుల్లో,
ఉదయం లేవగానే తన టీ తానే స్వయంగా తయారు చేసుకునేవారు.
అలాగే పోహా, కిచిడీ తయారు చేయడం ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా కిచిడీ తయారు చేయడం చాలా సులభం, పైగా త్వరగా అయిపోతుంది, జీర్ణం అవ్వడానికి కూడా తేలికగా ఉంటుంది. అందుకే RSSలో ఉన్నప్పుడు, తన కార్యాలయంలోని సహచరుల కోసం ఆయన తరచుగా కిచిడీ వండి పెట్టేవారు.
ఆయనకు సగ్గుబియ్యం కిచిడీ చేయడం కూడా బాగా వచ్చు. ఒకసారి ఒక కార్యక్రమంలో ఒక మహిళకు సగ్గుబియ్యం కిచిడీ ఎలా తయారు చేయాలో పూసగుచ్చినట్లు వివరించి, అక్కడున్న వారందరినీ ఆయన ఆశ్చర్యపరిచారు. ఈ వయసులో కూడా, సమయం దొరికితే తనకు ఇష్టమైన వంటకాలను వండటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications