భోజనం తర్వాత డెజర్ట్‌ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.!

శుభకార్యాలు, ఫంక్షన్స్‌లో వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు డెజర్ట్‌లకు చాలా క్రేజ్‌ ఉంటుంది. భోజనం తర్వాత వీటిని తప్పనిసరిగా టేస్ట్‌ చేయాల్సిందే. ఇక రెస్టారెంట్స్‌లో కూడా తిన్న తర్వాత తప్పనిసరిగా ఏదైనా స్వీట్‌ ఐటమ్‌ టేస్ట్‌ చేయనిదే తృప్తి ఉండదు చాలా మందికి. వీటితో పాటు కోల్డ్‌ కాఫీని చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని బయట కొనాలంటే రేట్‌ ఎక్కువే. కానీ ఇంట్లోనే బడ్జెట్‌ ధరలోనే ఈజీగా జెల్లీ కాఫీని చేసుకోవచ్చు. దీనిని తినడమే కాదు తాగవచ్చు కూడా.. ఇంటికి గెస్ట్స్‌ వచ్చినప్పుడు లేదా సాయంత్రం టైంలో ఈ జెల్లీ కాఫీని ట్రై చేయండి. ఈ టేస్ట్‌ని ఎప్పటికీ మరిచిపోలేరు. జెల్లీ కాఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

Jelly coffee for dessert or drink after meals prepare at home in easy process

జెల్లీ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మంచి నీళ్లు- 400 మి.లీ
కాఫీ పొడి- రెండు టీస్పూన్లు
బ్రౌన్‌ షుగర్‌- రెండు టేబుల్‌ స్పూన్లు
అగర్‌ అగర్‌- ఐదు గ్రాములు
మరిగించిన పాలు- లీటర్‌
కండెన్స్‌డ్‌ మిల్క్‌- 300 మి.లీ

జెల్లీ కాఫీ తయారీ విధానం

జెల్లీ కాఫీ తయారీ కోసం ముందుగా జెల్లీ క్యూబ్స్‌ని తయారుచేసుకోవాలి. ఇందులో స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని 400 మి.లీ మంచినీళ్లు పోసుకుని కాగనివ్వాలి.

బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!

నీళ్లు కాగుతున్నప్పుడు కాఫీ పొడి విస్క్‌తో వేసి కలపాలి. విస్క్‌తో కలపడం ద్వారా కాఫీ పొడి ఉండలు కట్టకుండా ఉంటుంది. విస్క్‌ లేకపోతే స్పాచులా సైతం ఉపయోగించవచ్చు.

Jelly coffee for dessert or drink after meals prepare at home in easy process

కాఫీ పొడి కలిసిన తర్వాత బ్రౌన్‌ షుగర్‌ లేదా చక్కెరను కలుపుకోవచ్చు. బ్రౌన్‌ షుగర్‌ కరిగిన తర్వాత జెల్లీలు సాఫ్ట్‌గా వచ్చేందుకు అగర్‌ అగర్‌ను తప్పకుండా కలపాలి. ఇది సోడా మాదిరిగా తెల్లగా ఉంటుంది. సూపర్‌ మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.

అగర్‌ అగర్‌ వేసి కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన మరిగించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా మరిగించాలి. స్పాచులాతో కొంచెం కాఫీ నీటిని పైకి తీసి కిందికి వదిలినప్పుడు ఒకేసారి జారకుండా బొట్లుబొట్లుగా కారుతుంటుంది.

అలా వచ్చిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని ఈ జెల్లీ వాటర్‌ను స్క్వేర్‌ షేప్‌ బాక్స్‌లో పోసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రీజర్‌లో కాకుండా మామూలు ఫ్రిజ్‌లో రెండు గంటల పాటు ఉంచాలి.

Jelly coffee for dessert or drink after meals prepare at home in easy process

ఈ లోపు లీటర్‌ పాలను తీసుకుని మరిగించుకోవాలి. కాచిన పాలు చల్లారిన తర్వాత ఇందులో కండెన్స్‌డ్‌ మిల్క్‌ కలుపుకోవాలి.

ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్‌ ఫాస్ట్!

జెల్లీ వాటర్‌ ఫ్రీజ్‌ అయిన తర్వాత బయటకు తీసి చాకుతో క్యూబ్‌ల్లా కట్‌ చేసుకోవాలి. ఈ క్యూబ్స్‌ను గాజు గ్లాసులో కావాల్సినన్ని వేసుకుని పై నుంచి పాలు పోసుకోవాలి.

టేస్టీ కోల్డ్‌ కాఫీ లేదా జెల్లీ కాఫీ రెడీ.. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు భోజనం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఈ జెల్లీ కాఫీని ట్రై చేయండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.

[ of 5 - Users]
Story first published: Monday, August 24, 2026, 9:59 [IST]
q
Desktop Bottom Promotion