Latest Updates
-
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.!
శుభకార్యాలు, ఫంక్షన్స్‌లో వెజ్, నాన్‌వెజ్‌తో పాటు డెజర్ట్‌లకు చాలా క్రేజ్ ఉంటుంది. భోజనం తర్వాత వీటిని తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సిందే. ఇక రెస్టారెంట్స్‌లో కూడా తిన్న తర్వాత తప్పనిసరిగా ఏదైనా స్వీట్ ఐటమ్ టేస్ట్ చేయనిదే తృప్తి ఉండదు చాలా మందికి. వీటితో పాటు కోల్డ్ కాఫీని చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని బయట కొనాలంటే రేట్ ఎక్కువే. కానీ ఇంట్లోనే బడ్జెట్ ధరలోనే ఈజీగా జెల్లీ కాఫీని చేసుకోవచ్చు. దీనిని తినడమే కాదు తాగవచ్చు కూడా.. ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు లేదా సాయంత్రం టైంలో ఈ జెల్లీ కాఫీని ట్రై చేయండి. ఈ టేస్ట్‌ని ఎప్పటికీ మరిచిపోలేరు. జెల్లీ కాఫీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

జెల్లీ కాఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
మంచి నీళ్లు- 400 మి.లీ
కాఫీ పొడి- రెండు టీస్పూన్లు
బ్రౌన్ షుగర్- రెండు టేబుల్
స్పూన్లు
అగర్ అగర్- ఐదు గ్రాములు
మరిగించిన పాలు- లీటర్
కండెన్స్‌డ్ మిల్క్- 300 మి.లీ
జెల్లీ కాఫీ తయారీ విధానం
జెల్లీ కాఫీ తయారీ కోసం ముందుగా జెల్లీ క్యూబ్స్‌ని తయారుచేసుకోవాలి. ఇందులో స్టవ్‌పైన వెడల్పాటి కడాయి పెట్టుకుని 400 మి.లీ మంచినీళ్లు పోసుకుని కాగనివ్వాలి.
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!
నీళ్లు కాగుతున్నప్పుడు కాఫీ పొడి విస్క్‌తో వేసి కలపాలి. విస్క్‌తో కలపడం ద్వారా కాఫీ పొడి ఉండలు కట్టకుండా ఉంటుంది. విస్క్ లేకపోతే స్పాచులా సైతం ఉపయోగించవచ్చు.

కాఫీ పొడి కలిసిన తర్వాత బ్రౌన్ షుగర్ లేదా చక్కెరను కలుపుకోవచ్చు. బ్రౌన్ షుగర్ కరిగిన తర్వాత జెల్లీలు సాఫ్ట్‌గా వచ్చేందుకు అగర్ అగర్‌ను తప్పకుండా కలపాలి. ఇది సోడా మాదిరిగా తెల్లగా ఉంటుంది. సూపర్ మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
అగర్ అగర్ వేసి కలిపిన తర్వాత ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన మరిగించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్‌గా కాకుండా మరిగించాలి. స్పాచులాతో కొంచెం కాఫీ నీటిని పైకి తీసి కిందికి వదిలినప్పుడు ఒకేసారి జారకుండా బొట్లుబొట్లుగా కారుతుంటుంది.
అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ జెల్లీ వాటర్‌ను స్క్వేర్ షేప్ బాక్స్‌లో పోసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫ్రీజర్‌లో కాకుండా మామూలు ఫ్రిజ్‌లో రెండు గంటల పాటు ఉంచాలి.

ఈ లోపు లీటర్ పాలను తీసుకుని మరిగించుకోవాలి. కాచిన పాలు చల్లారిన తర్వాత ఇందులో కండెన్స్‌డ్ మిల్క్ కలుపుకోవాలి.
జెల్లీ వాటర్ ఫ్రీజ్ అయిన తర్వాత బయటకు తీసి చాకుతో క్యూబ్‌ల్లా కట్ చేసుకోవాలి. ఈ క్యూబ్స్‌ను గాజు గ్లాసులో కావాల్సినన్ని వేసుకుని పై నుంచి పాలు పోసుకోవాలి.
టేస్టీ కోల్డ్ కాఫీ లేదా జెల్లీ కాఫీ రెడీ.. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు భోజనం తర్వాత లేదా సాయంత్రం సమయంలో ఈ జెల్లీ కాఫీని ట్రై చేయండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
