Latest Updates
-
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే?
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే..
దక్షిణ భారతీయ వంటకాల్లో కరివేపాకు లేనిదే ఏ కూరా పూర్తి కాదు, ఏ తాలింపూ ఘుమఘుమలాడదు. కానీ వడ్డించిన కంచంలో కరివేపాకు కనిపిస్తే మాత్రం.. దానిని తీసి పక్కన పెట్టేస్తుంటారు చాలామంది. కరివేపాకు కేవలం వంటకు సువాసనను మాత్రమే కాదు, మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
కరివేపాకును నేరుగా తినలేని వారి కోసం, దానిలోని పోషకాలన్నీ పూర్తిగా మన శరీరానికి అందేలా చేసే అద్భుతమైన రెసిపీనే కరివేపాకు కారం పొడి. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ పొడి కలుపుకుని తింటే ఆ రుచే వేరు. ఇడ్లీ, దోశల్లోకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ కరివేపాకు పొడిని చేసి పెట్టుకుంటే, వారాల పాటు నిల్వ ఉంటుంది. ఆరోగ్యానికి, రుచికి చిరునామా అయిన ఈ కరివేపాకు పొడిని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కరివేపాకు పొడి తయారీకి కావలసిన పదార్థాలు
-కరివేపాకు
-నెయ్యి
-పల్లీలు
-శనగపప్పు
-మినపప్పు
-ధనియాలు
-జీలకర్ర
-ఆవాలు
-వెల్లుల్లి రెబ్బలు
-ఎండు కొబ్బరి ముక్కలు
-ఎండు మిర్చి
-ఇంగువ
-ఆమ్చార్ పౌడర్ (మామిడికాయ పొడి)
-ఉప్పు
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా..
కరివేపాకు పొడి తయారీ విధానం
-ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి, నీడలో ఆరబెట్టాలి.
-ఆకుల్లో తడి పూర్తిగా పోయాక ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరివేపాకు కరకరలాడే వరకు సన్నని మంటపై వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, ఎండు మిర్చి, చిటికెడు ఇంగువ వేసి దోరగా, సువాసన వచ్చేంతవరకు వేయించాలి.
-వేయించిన పదార్థాలన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వీటన్నింటితో పాటు వేయించిన కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కలిపి బరకగా (కొంచెం పలుకుగా) మిక్సీ పట్టుకోవాలి.
-పొడి చేసుకున్న ఈ మిశ్రమాన్ని మళ్లీ పాన్లో వేసి, చిన్న మంట మీద ఒక నిమిషం పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల పొడిలో ఏమైనా తేమ ఉంటే పోయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
-అంతే కరివేపాకు కారం రెడీ. ఈ పొడిని పూర్తిగా చల్లారాక ఒక గాలి చొరబడని గాజు సీసాలో పెట్టుకుంటే వారాల పాటు ఫ్రెష్ గా ఉంటుంది.
కరివేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
-కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్, ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని అరికట్టి, కుదుళ్లను దృఢంగా చేస్తాయి. జుట్టు ఒత్తుగా, నల్లగా పెరిగేలా ఇది సహాయపడుతుంది.
-కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి.
-కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది.
-కరివేపాకులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉండటం వల్ల ఇది రక్తహీనత రాకుండా కాపాడుతుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
