రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

వేడి వేడి ఇడ్లీలపై కొద్దిగా నువ్వుల నూనె వేసి, కమ్మని కారం పొడి చల్లుకుని తింటే ఆ మజాయే వేరు. దోశకైనా, వేడి వేడి అన్నానికైనా ఈ పొడి ఉంటే కూరతో పనే ఉండదు.

అయితే ఎప్పుడూ తినే పప్పుల పొడి కాకుండా రుచితో పాటు మన శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడిని ఎప్పుడైనా ట్రై చేశారా? ఎంతో ఆరోగ్యకరమైన, సువాసనభరితమైన ఈ పొడిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Nalla Nuvvula Podi Recipe in Telugu Get Iron Like Strength With Black Sesame Seeds Karam

కావలసిన పదార్థాలు

నల్ల నువ్వులు - 150 గ్రాములు
మినపపప్పు (మినుములు) - 200 గ్రాములు
ఎండు మిరపకాయలు - 15
ఇంగువ - అర టీస్పూన్
కరివేపాకు - ఒక గుప్పెడు
రాతి ఉప్పు- రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్న పాన్ పెట్టుకోండి. మంటను మీడియంలో ఉంచి నల్ల నువ్వులను వేయించండి. నువ్వులు చిటపటలాడుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. నువ్వులు మాడిపోతే చేదు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్ లో మినపపప్పు వేసి, అవి దోరగా, బంగారు గోధుమ రంగులోకి మారి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.

-తర్వాత, కడిగి ఆరబెట్టుకున్న గుప్పెడు కరివేపాకును వేసి అందులోని తడి పోయి, కరకరలాడేంత వరకు వేయించండి.

-ఇప్పుడు ఎండు మిరపకాయలు, దానికి తగినంత రాతి ఉప్పు వేసి కొద్దిసేపు వేయించండి.

-చివరగా స్టవ్ ఆఫ్ చేసి, ఆ వేడి పాన్ లోనే ఇంగువ వేసి కాసేపు ఉంచండి. ఆ వేడికే ఇంగువ చక్కగా వేగుతుంది.

-వేయించిన పదార్థాలన్నింటినీ బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి మరీ మెత్తటి పౌడర్‌ లా కాకుండా, కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి.

-అంతే ఘుమఘుమలాడే నువ్వుల పొడి రెడీ.

ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం!

ఈ నువ్వుల పొడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎముకలకు బలం: నల్ల నువ్వులలో కాల్షియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి, కీళ్ల నొప్పులు రాకుండా కాపాడతాయి.

రక్తహీనతకు చెక్: ఇందులో ఐరన్ శాతం చాలా ఎక్కువ. రోజూ ఈ పొడిని ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత సమస్య దరిచేరదు.

కేశాల సంరక్షణ: నల్ల నువ్వులు, కరివేపాకు కలయిక జుట్టు రాలడాన్ని అరికట్టి, కురులు నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

గుండెకు మేలు: ఇందులో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

జీర్ణక్రియకు సహాయం: ఇంగువ, రాతి ఉప్పు జీర్ణవ్యవస్థను చురుకుగా ఉంచుతాయి. గ్యాస్ సమస్యలను నివారిస్తాయి.

[ of 5 - Users]
Story first published: Wednesday, October 14, 2026, 18:10 [IST]
Desktop Bottom Promotion