Latest Updates
-
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే..
బ్రెడ్ లేకుండానే అదిరిపోయే శాండ్ విచ్.. ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవల్!
సాధారణంగా శాండ్‌విచ్ అనగానే మనకు వెంటనే బ్రెడ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ, బ్రెడ్ లేకుండానే, ఎంతో వినూత్నంగా,రుచికరమైన శాండ్ విచ్ చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? బయట దొరికే జంక్ ఫుడ్ కు బదులుగా, ఇంట్లోనే మనకు అందుబాటులో ఉండే బంగాళాదుంపలు, తాజా కూరగాయలు,చీజ్ ఉపయోగించి బ్రెడ్ లెస్ పొటాటో శాండ్ విచ్ చేయవచ్చు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి లేదా సాయంత్రం వేడి వేడి టీతో పాటు స్నాక్ గా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

బ్రెడ్ లెస్ పొటాటో శాండ్ విచ్ తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద బంగాళదుంపలు - 4
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
మొజారెల్లా చీజ్ - అర కప్పు
స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు) - అర కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు
టమాటా ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి - 1 టీస్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - మీ కారానికి తగినంత
ఒరేగానో - రుచికి తగినంత
ఉప్పు - రుచికి తగినంత
నూనె లేదా వెన్న - కాల్చుకోవడానికి

బ్రెడ్ లెస్ పొటాటో శాండ్ విచ్ తయారీ విధానం
-ముందుగా బంగాళాదుంపల పొట్టు తీసి, పెద్ద రంధ్రాలున్న తురుము పీటపై సన్నగా, పొడవుగా తురుముకోవాలి. ఆ తురుమును చల్లటి నీళ్లలో 2 లేదా 3 నిమిషాల పాటు నానబెట్టాలి.
-ఇప్పుడు నీళ్లలోంచి బంగాళాదుంప తురుమును తీసి, అందులోని నీరంతా పోయేలా చేతులతో గట్టిగా పిండాలి. ఒక గిన్నెలో ఈ తురుము, మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ లేదా పెనం పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని పెనంపై గుండ్రంగా లేదా బ్రెడ్ ఆకారంలో సమానంగా సర్దాలి. గరిటెతో గట్టిగా నొక్కాలి. బంగాళాదుంప తురుము విడిపోకుండా, ఒకదానికొకటి అంటుకునేలా మీడియం మీద నిదానంగా కాల్చుకోవాలి.
-ఒకవైపు క్రిస్పీగా, గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత, జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పి అటు కూడా ఎర్రగా కాల్చుకోవాలి.
-ఈ పొటాటో బేస్ వేగేలోపు స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో స్వీట్ కార్న్, క్యాప్సికమ్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేసి బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు పెనంపై కాలుతున్న పొటాటో బేస్‌లో సగం భాగంపై, మనం సిద్ధం చేసుకున్న ఈ కూరగాయల మిశ్రమాన్ని దట్టంగా పరచాలి. మరింత రుచి కోసం కూరగాయల మిశ్రమం పైన మొజారెల్లా చీజ్ తురుమును (లేదా చీజ్ స్లైస్) చల్లాలి. ఇప్పుడు పొటాటో బేస్ మిగిలిన రెండో సగభాగాన్ని దీనిపైకి మడిచి (ఫోల్డ్ చేసి) శాండ్ విచ్ లా మూసివేయాలి. లోపల చీజ్ కరిగి, కూరగాయలు మగ్గేలా గరిటెతో నెమ్మదిగా నొక్కుతూ సన్నపు మంటపై కాల్చాలి.
-రెండు వైపులా కరకరలాడేలా కాలిన తర్వాత, పాన్ మీద నుంచి తీసి పళ్లెంలో పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పైన కొద్దిగా గార్లిక్ బటర్ రాస్తే ఆ సువాసన, రుచి అద్భుతంగా ఉంటాయి. దీన్ని మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసి, టమాటా కెచ ప్‌తో తింటే ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
