Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
చుక్క నూనె లేకుండానే..కరకరలాడే రాగి చిప్స్..బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్!
బయట దొరికే ప్యాకెట్ చిప్స్ లేదా నూనెలో డీప్ ఫ్రై చేసిన జంక్ ఫుడ్ తినాలంటే ఆరోగ్య స్పృహ ఉన్నవారికి కాస్త భయమేస్తుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ రాగి చిప్స్ ఓ సారి ట్రై చేయండి. బయట దొరికే మైదా, ప్రిజర్వేటివ్స్ ఉన్న చిప్స్ కంటే.. ఇంట్లోనే కేవలం 20 నిమిషాల్లో సులభంగా, ఎలాంటి శ్రమ లేకుండా తయారుచేసుకునే ఈ బేక్డ్ రాగి చిప్స్ పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బెస్ట్ ఆప్షన్.
రాగులు పోషకాల గని. వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలోనూ, బరువు తగ్గాలనుకునే వారికి సాయపడటంలోనూ రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. హెల్తీ అండ్ టేస్టీ రాగి చిప్స్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

రాగి చిప్స్ తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి: 1 కప్పు
గోధుమ పిండి:అర కప్పు
వంట నూనె: 2 టీస్పూన్లు
కారం: 1 టీస్పూన్
పెరుగు: 1 టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: పిండి కలుపుకోవడానికి తగినన్ని
రాగి చిప్స్ తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో జల్లించి పెట్టుకున్న రాగి పిండి, గోధుమ పిండి,రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా పెరుగు వేసి అన్నీ పిండిలో బాగా కలిసేలా చేత్తో మిక్స్ చేయండి.
-ఇప్పుడు పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, చపాతీ పిండిలా కాస్త గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా ఉంటే చిప్స్ కరకరలాడవు, కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోండి.
-ఈలోపు మీ ఓవెన్ ను 180°C ఉష్ణోగ్రత దగ్గర ప్రీ హీట్ చేసి ఉంచుకోండి.
-కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లి, ఈ ఉండలను చపాతీ కర్రతో వీలైనంత పల్చగా వత్తుకోవాలి. ఎంత పల్చగా వత్తితే చిప్స్ అంత క్రిస్పీగా వస్తాయి.
-వత్తుకున్న పిండిని కత్తి లేదా పిజ్జా కట్టర్ సహాయంతో మీకు నచ్చిన ఆకారంలో (ట్రయాంగిల్, స్క్వేర్ లేదా డైమండ్ షేప్ లో) కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలో కట్ చేసిన చిప్స్ ముక్కలను ఒకదానికొకటి అంటుకోకుండా వరుసగా సర్దండి. చిప్స్ పైన బ్రష్‌తో కొద్దిగా నూనె రాయండి. ఈ ట్రేని ప్రీ హీట్ చేసిన ఓవెన్ లో పెట్టి12-15 నిమిషాల పాటు బేక్ చేయాలి. చిప్స్ అంచులు బ్రౌన్ కలర్ లోకి మారి, కరకరలాడేలా తయారయ్యాక ఓవెన్ ఆపేయాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి చిప్స్ రెడీ. వీటిని టొమాటో కెచప్, పుదీనా చట్నీ లేదా మయోనైస్‌తో నంచుకుని తింటే ఆ రుచే వేరు.
-ఈ చిప్స్ పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక గాలి చొరబడని గాజు లేదా స్టీల్ డబ్బాలో భద్రపరుచుకుంటే వారం నుంచి పది రోజుల పాటు ఏమాత్రం మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
