మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

పిల్లలు పిజ్జా అంటే ప్రాణం పెడతారు. కానీ, అందులో ఉండే మైదా, ప్రిజర్వేటివ్స్ వల్ల ఫాస్ట్ ఫుడ్ పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదని తల్లిదండ్రులుగా మనకు ఎప్పుడూ ఒకటే టెన్షన్. అందుకే పిజ్జాకు అచ్చమైన, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చీజ్ పరాఠా ఓ సారి ట్రై చేయండి.

ఇంట్లోనే హైజీనిక్‌ గా చేసే ఈ పరాఠాలో చీజ్ కరిగిపోతూ అచ్చం పిజ్జాలానే అనిపిస్తుంది. పిల్లలు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. చీజ్ పరాఠా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Maida Healthy Cheese Paratha Recipe in Telugu Best Homemade Pizza Alternative for Kids

కావాల్సిన పదార్థాలు

గోధుమ పిండి - 1 కప్పు (150 గ్రాములు)
మైదా పిండి - 1 కప్పు
నెయ్యి - 3 లేదా 4 టేబుల్ స్పూన్లు
మొజారెల్లా చీజ్ - 1 ప్యాకెట్ (200 గ్రాములు)
పిజ్జా సాస్ - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి తగినంత

తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..

తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి, మైదా, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మృదువుగా ఉండాలి. ఈ పిండి ముద్దపై ఒక మూతను ఉంచి సుమారు 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల పరాఠాలు సాఫ్ట్‌ గా వస్తాయి.

-20 నిమిషాల తర్వాత, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని పిండిని మరోసారి బాగా మర్దన చేయాలి. పిండి నుండి నిమ్మకాయంత సైజులో ఒక చిన్న ముద్దను తీసుకుని, పొడి పిండి చల్లుతూ చిన్న పూరీలా ఒత్తుకోవాలి.

-ఇప్పుడు దానిపై కొద్దిగా పిజ్జా సాస్ పూయాలి. అంచుల వరకు కాకుండా మధ్యలో మాత్రమే సాస్ రాసి, దానిపై తురుముకున్న మొజారెల్లా చీజ్ ఉంచాలి. ఆ తర్వాత అంచులన్నింటినీ దగ్గరకు తెస్తూ, చీజ్ బయటకు రాకుండా మూసివేయాలి. దీన్ని నెమ్మదిగా చేతివేళ్లతో అదిమి, మళ్లీ పొడి పిండి చల్లుతూ మందపాటి పరాఠాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి

-స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నెయ్యి రాసి, మనం సిద్ధం చేసుకున్న పరాఠాను దానిపై ఉంచండి. మీడియం మంట మీద కింది వైపు కాస్త కాలాక పరాఠాను రెండో వైపుకు తిప్పాలి. ఇప్పుడు రెండు వైపులా నెయ్యి రాస్తూ, గరిటెతో నెమ్మదిగా నొక్కుతూ దోరగా కాల్చుకోవాలి.

-పరాఠాకు రెండు వైపులా లేత గోధుమ రంగు మచ్చలు వచ్చేవరకు కాల్చుకుంటే, లోపల చీజ్ కరిగి భలే రుచిగా ఉంటుంది.

-అంతే వేడివేడి చీజ్ పరాఠా రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, October 1, 2026, 20:30 [IST]
Desktop Bottom Promotion