Latest Updates
-
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా?
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
రాయలసీమ అంటేనే స్పైసీ వంటకాలకు పెట్టింది పేరు. రాయలసీమ ప్రాంతంలో లభించే వంటకాలకు దేశవ్యాప్తంగా పెద్ద క్రేజ్ ఉంటుంది. రాయలసీమ స్టైల్ లో వెల్లుల్లి కారం ఒక్కసారి మీ ఇంట్లో చేశారంటే అంటే..నోట్లో పెట్టుకుంటే ఆహా ఓహో అనకుండా ఉండలేరు. దీని రుచి అద్భుతం,అమోఘం. టిఫిన్స్, వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి రాయలసీమ వెల్లుల్లి కారం కలుపుకుని తింటుంటే..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంటదే తప్ప ఆపాలనిపించదు
దీనిని తయారుచేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ. ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. రాయలసీమ స్టైల్ వెల్లుల్లి కారం మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-నూనె
-సాంబార్ ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-ఉప్పు
-కరివేపాకు
-మినపప్పు
-ఆవాలు
-ఎండుమిర్చి
-చింతపండు
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు!
వెల్లుల్లి కారం తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి. అందులో 3 టేబెల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక అందులో 5 సాంబార్ ఉల్లిపాయలు లేదా 1 సాధారణ మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి అది పైన ఎర్రబడి,లోపల మెత్తబడే వరకు వేయించాలి.
-ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే ఆ బాండీలోనే 1 కప్పు(100 గ్రాములు)పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంట మీద అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేపాలి.
-వెల్లుల్లి వేగాక అందులోనే 15 కారంగా ఉండే ఎండుమిరపకాయలను వేసి వేయించాలి. అవి కాస్త వేగాక అందులో గోలీ సైజ్ అంత చింతపండు వేసి 30 సెకన్లు మాత్రం వేయించి స్టవ్ ఆపేయండి.ఈ మిశ్రమం చల్లారాక మెత్తం మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే కొద్దిగా రాళ్ల ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత తాలింపు కోసం స్టవ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాక అందులో 1 టీస్పూన్ మినపప్పు వేసి తాలింపుని ఎర్రగా, కరకరలాడేలా వేపుకోవాలి. తర్వాత అందులో 2 ఎండుమిర్చి, 6 దంచుకున్న వెల్లల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు వేగిన తాలింపులో గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె పైకి తేలేంతవరకు తక్కువ మంట మీద కలుపుతూ ఫ్రై చేయాలి. తర్వాత స్టవ ఆపేయండి.
-అంతే రాయలసీమ స్టైల్ వెల్లుల్లి కారం రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
