Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చిట్టినాడు ఎగ్ కర్రీ

ఉడికించిన ఎగ్: 3
ఉల్లిపాయ: 15
టమోట: 1
కారం: 1/4 tsp
పసుపు: 1/4 tsp
ఆయిల్: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
పేస్ట్ కొరకు
ధనియా: 2tsp
ఎండుమిర్చి: 2
వెల్లుల్లి: 2
అల్లం: 1/2పీస్
కరివేపాకు: 2 రెబ్బలు
రైస్: 1/2tsp
మిరియాలు: 1/2tsp
జీలకర్ర: 1/4tsp
సోంపు: 1/2tsp
కొబ్బరి తురుము: 4tsp
తయారు చేయు విధానము:
1. గ్రుడ్లను నీటి లో ఉడికించి డొల్ల తీసి కావలసిన ఆకారంలో కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను కట్ చేసి ఆయిల్ లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. టమోటను కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక పేస్ట్ కొరకు సిద్దం చేసుకొన్న పదార్ధాలన్నింటిని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ తక్కువ మంట మీద వేయించాలి.
4. వేయించిన పదార్ధాలన్నింటికి కొద్దిగా నీటిని జత చేసి పేస్ట్ లా గ్రైడ్ చేసి పెట్టుకోవాలి.
5. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత టమోటో వేసి మదువుగా అయ్యేంత వరకూ వేయించాలి.
6. అందులో కారం, పసుపు, గ్రైడ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్ద, ఉప్పు వేసి వేయించి కొద్దిగా నీళ్లు పోసి మీడియం మంట మీద 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
7. చివరగా ఉడికించి పెట్టుకొన్న గ్రుడ్లను అందులో వేసి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత వేరే గిన్నెలోనికి తీసుకొని కొత్తిమీర చల్లి గార్నిష్ చేయాలి అంతే చిట్టినాడు ఎగ్ కర్రీ రెడీ. ఇది చపాతి మరియు రైస్ కి మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications