Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చెట్టినాడు స్టైల్ స్పైసీ ఎగ్ కర్రీ
గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. మీరు చెట్టినాడు వంటకాల ప్రత్యేకతను వినే ఉంటారు. తమిళనాడు సైడ్ చేసే ఈ వంటకాలు చాలా కారంగాను, రుచిగాను చూడటానికి నోరూరిస్తుంటాయి. చెట్టినాడు స్పెషల్స్ సౌంత్ స్టేట్స్ లో చాలా ఫేమస్. చెట్టినాడు వంటలకు మాత్రమే కాదు అక్కడ చెట్టినాడు సారీలకు కూడా ఫేమస్సే...
ఇండియన్ వంటకాల్లో ఎగ్ కర్రీని చాలా సాధారణంగా ఎక్కువగా వండుతుంటారు. మరి అదే కర్రీని చెట్టినాడు స్టైల్లో వండితే ఎలా ఉంటుంది. ఇది కారంగా రుచిగా ఉండటమే కాదు ప్లెయిన్ రైస్ తో తినడానికి చిక్కటి గ్రేవితో నూరూరిస్తుంటుంది. మరి ఈ చెట్టినాడు స్టైల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం....
కావల్సిన పదార్థాలు:
గుడ్లు: : 3
ఉల్లిపాయ: 1 (finely chopped)
టమోటో: 1(finely chopped)
కొత్తిమీర తరుగు: 1tbsp(finely chopped)
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా

పోపుకోసం:
చెక్క: ½ inch
కరివేపాకు: రెండు రెమ్మలు
లవంగాలు: 1
మసాలా మద్దుకొరుకు(వేగించుకోవడానికి ):
కొబ్బరి తురుము: : 2tbsp
ఎండు మిర్చి: 2
వెల్లుల్లి రెబ్బలు: 4-5
అల్లం: ½ inch
ధనియాలు: ½ tsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు): 1tsp
జీలకర్ర: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు, నీళ్ళు పోసి ఉడికించి పక్కకూ తీసి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టం అయితే రెండు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో వేగించుకోవాల్సిన పదార్థాలన్నింటిని వేసి తక్కువ మంట మీద 2నిముషాలు వేగించుకొని పక్కక తీసి చల్లారనివ్వాలి.
3. చల్లారిన తర్వాత వీటిని పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపుకోసం సిద్దంగా ఉంచుకొన్ని కరివేపాకు, చెక్క, లవంగాలు వేసి వేగించాలి.
5. అలాగే అందులోఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలువేసి బ్రౌన్ కలర్ మరియు మెత్తగా వేగే వరకూ వేగించాలి. అలాగే ఉప్పును కూడా చిలకరించాలి.
6. ఇప్పుడు అందులో పేస్ట్ చేసి పెట్టుకొన్న మసాల ముద్దను కూడా వేసి వేగించుకోవాలి. ఈ మిశ్రమంతా బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత అందుల అరకప్పు నీళ్ళు పోసి ఉడికించాలి.
7. తర్వాత అందులో గరం మసాల చిలకరించి, అలాగే ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నంతటిని మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే చెట్టినాడ్ ఎగ్ కర్రీ రెడీ. దీన్ని కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications