Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రిసిపి
మన ఇండియాలో, సౌత్ స్టేట్స్ లో చెట్టినడ్ రిసిపిలు చాలా ప్రసిద్ధి. సౌత్ స్టేట్స్ లో ఒక టైన తమిళనాడు లోని శివగంగ డిస్టిక్ ప్రాంతంలో తయారుచేసే ఈ వంట చాలా పాపులర్. శివగంగా స్థలం ఒకటే ప్రసిద్ది కాదు, ఈ స్పైసీ, రుచికరమైన చెట్టినాడ్ వంటలతో పాటు, చెట్టినాడ్ శారీలు కూడా బాగా ప్రసిద్ది.
చాలా వంటలను అక్కడ చెడ్డినాడ్ రిసిపిలుగా పేరు మార్చారు . ఎందుకంటే ఇవి చాలా సింపుల్ గా మరియు ఆరోమా స్మెల్ తో అద్భుంగా నోరూరిస్తుంటాయి. మీరు వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ వంటలను రెండింటిని చెట్టినాడ్ స్టైల్లో తయారుచేయవచ్చు . పెప్పర్ చికెన్ పాపులర్ నాన్ వెజిటేరియన్ రిసిపి. దీన్ని వివిధ పద్దతుల్లో తయారుచేస్తారు . మరి మీరు కూడా ఈ స్పెషల్ చెట్టినాడ్ పెప్పర్ చికెన్ తయారుచేసి, రుచిచూడండి....

కావల్సిన పదార్థాలు
చికెన్: 250gms (చిన్నగా లేదా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పచ్చిమిర్చి 2-3 (మద్యలోకి కట్ చేయాలి)
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
దాల్చిన చెక్క: 1 అంగుళం
లవంగాలు: 2
ధనియాల పొడి: 1tbsp
జీలకర్ర : 1tsp
యాలకులు: 2
మిరియాలపొడి: కొద్దిగా
జీలకర్ర: చిటికెడు
ఆవాలు: ½tsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tbsp
కరివేపాకు: 2 రెమ్మలు
తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడిచేయాలి. అందులో ఆవాలు, చెక్క, యాలకులు, లవంగాల మరియు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులో కరివేపాకు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిర్చి ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి.
2. 5నిముషాలు వేగించికొన్న తర్వాత . తర్వాత అందులో పసుపువేసి వేగించాలి. ఉల్లిపాయలు మెత్తగా వేగినతర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి, మెత్తగా అయ్యే వరకూ వేగించుకోవాలి . మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో కొత్తిమీర, కారం, జీలకర్ర మరియు ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి, టమోటో చాలా మెత్తగా ఉడికేంత వరకూ వేగించుకవోాలి.
4. ఇప్పుడు అందులో చికెన్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి, 15-20నిముషాలు ఉడికించుకవోాలి.
5.చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వత, అందులో పొడిచేసి పెట్టుకొన్న మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి . తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే చెట్టినాడ్ స్టైల్ పెప్పర్ చికెన్ రెడీ. కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, అన్నంకు సైడ్ డిష్ గా సర్వ్ చేయండి.



Click it and Unblock the Notifications