Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
చికెన్ షేజ్వాన్ రైస్: రెడ్ హాట్ ట్రీట్
ప్రస్తుత రోజుల్లో ఫ్రైడ్ రైస్ రిసిపిలు చాలా ఫేమస్ అయ్యాయి. మన ఇండియన్ యంగ్ స్టర్స్ ప్రస్తుత రోజుల్లో పులావ్ మరియు బిర్యానీ వంటి వాటికి అంతగా ఇష్టపడుట లేదు. ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ మీద మొగ్గుచూపుతున్నారు. వారు ఎప్పుడు ఏదో కొత్త రుచులను మరియు డిఫరెంట్ టేస్ట్ ను కోరుకుంటున్నారు. చైనీస్ మరియు కాంటినెంటల్ రిసిపిలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకోసం ప్రస్తుత రోజుల్లో చికెన్ షేజ్వాన్ రిసిపికి అంత క్రేజ్ వచ్చింది.
దాదాపు అన్ని రెస్టారెంట్స్ లో మెనులో చికెన్ షేజ్వాన్ రిసిపి చూస్తుంటారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చికెన్ షేజ్వాన్ రిసిపి స్ట్రీట్ ఫుడ్ కూడా..చికెన్ షేజ్వాన్ రైస్ రిసిని నేరుగా చైనీస్ రిసిపి కాదు, కానీ, ఇండో చైనీస్ వంట అని చెప్పవచ్చు. ఈ చికెన్ రైస్ రిసిపికి ఎక్కువగా షేజ్వాన్ సాస్ మిక్స్ చేయడం వల్ల ఇది చాలా రెడ్ కలర్ లో నోరూరిస్తుంటుంది. మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే, తయారుచేసే విధానాన్ని తెలుసుకోండి...

కావల్సిన పదార్థాలు: చికెన్ 100grms
రైస్: 2cups
ఉల్లిపాయ: 1పెద్దది(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 8(కట్ చేసుకోవాలి)
క్యారెట్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
బీన్స్ : 4(సన్నగా కట్ చేసుకోవాలి)
క్యాప్సికమ్: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
షేజ్వాన్ సాస్: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను ప్రెజర్ కుక్కర్ లో వేసి 2 కప్పుల నీళ్ళు మరియు ఉప్పు వేసి ఉడికించుకోవాలి. 2విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
2. ఇప్పుడు చికెన్ ముక్కలను పక్కన తీసి పెట్టుకోవాలి. చికెన్ సూప్ ను సపరేట్ గా పెట్టుకోవాలి.
3. చికెన్ సూప్ లో మరికొద్దిగా నీళ్ళు కూడా కలుపుకోవచ్చు(మీకు అవసరం అయితేనే)ఈ సూప్ లో శుభ్రంగా కడిగిన బియ్యం వేసి అన్నం వండుకోవాలి.
4. అన్న చికెన్ ఉడికించిన నీటిలో వండటం వల్ల చికెన్ ఫ్లేవర్ ఉంటుంది .
5. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేగించుకోవాలి.
6. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కులు మరియు వెల్లుల్లి ముక్కలు కూడా వేసి మరో 2నిముషాలు తక్కువ మంట మీద వేగించుకోవాలి.
7. ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలన్నింటిని వేసి మరో 5 నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
8.వెజిటేబుల్ ముక్కలు మీడియంగా వేగిన తర్వాత అందులో టమోటో సాస్ మరియు షేజ్వాన్ సాస్ ను పాన్ లో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
9. తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకొన్న చికెన్ ముక్కలు మరియు అన్నం కూడా వేసి, కొద్దిగా ఉప్పు చిలకరించి ఫ్రై చేసుకోవాలి.
10. ఎక్కువ కలియబెట్టకుండా ఒక్క సారిగా మొత్తం మిశ్రమాన్ని కలగలిపి మూత పెట్టి రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద అలాగే ఉంచి తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే చికెన్ షేజ్వాన్ రైస్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications