Latest Updates
-
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే! -
మేషం, వృశ్చికం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? – మంగళవారం, 05 మే 2026 -
మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందని చెప్పే 5 ముఖ్యమైన సంకేతాలివే! -
డీప్‌ఫేక్ సెక్స్టార్షన్ ఉచ్చులో పడ్డారా? మీ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే! -
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే! -
తెలంగాణ-ఏపీలో ఎండల తీవ్రత: గర్భిణీలకు పొంచి ఉన్న ముప్పు ఇదే! -
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి! -
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది! -
విజయ్–త్రిష వెడ్డింగ్ వీడియో.. సోషల్ మీడియాలో రచ్చ! అసలు నిజం ఇదేనా?
నాటు కోడి షోరువా చికెన్ స్పెషల్-స్పెషల్ టేస్ట్

చికెన్ సూప్ తో తయారు చేసే చికెన్ షోరువా ఇండియన్ మసాలాలు, కొద్దిగా ఘాటైనా మసాలా ధినుసులు వేయడంతో మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ చికెన్ షోరువాను ఇంట్లోనే ఎలా తయారు చేయాలి. అందుకు ఏమేమికావాలో ఒక సారి చూసి మీరు ఈ సండే స్పెషల్ వంటకాన్ని ఎంజాయ్ చేయండి.
కావలసినపదార్థాలు
చికెన్: 750grms,
మిరప్పొడి: 3tbsp (కారంగా ఇష్టపడేవాళ్లు మరింత వేసుకోవచ్చు),
పసుపు: 1tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: ఒక్కొక్కటి మూడు టేబుల్ స్పూన్ల చొప్పున (కడిగిన చికెన్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి పక్కన ఉంచాలి),
నూనె: 4tbsp
కరివేపాకు: రెండు రెమ్మలు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 2cups
కాశ్మీరీ మిరప్పొడి: 2tsp
మసాలా పౌడర్: 4tsp
ఉప్పు: తగినంత
కొత్తిమీర: గుప్పెడు (సన్నగా తరగాలి)
తయారు చేయు విధానం:
1. ముందుగా నాన్ స్టిక్ పాన్ లో నూనె వేడి చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
2. ఉల్లిపాయలు ఎరగ్రా వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, మిరప్పొడి పట్టించి ఉంచిన చికెన్ మిశ్రమాన్ని వేసి సన్నమంట మీద వేగనివ్వాలి.
3. చికెన్ ముక్కల్లో ఎరుపుదనం పోయి నీరు వెలువడడం మొదలయ్యాక మసాలా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలిపి కొద్ది సేపు మగ్గనివ్వాలి.
4. ఇప్పుడు ఒకటిన్నర కప్పు నీటిని పోసి పది నిమిషాల సేపు సన్నమంట మీద ఉడికించాలి. మధ్యలో మూడు నిమిషాలకొకసారి కలిపి మూత పెడుతుండాలి. ఉప్పు, కొత్తిమీర వేసి సమంగా పట్టేటట్లు కలిపి దించాలి. ఇది అన్నం, గారెలలోకి బాగుంటుంది.
మసాలా పౌడర్ తయారి: ఆరు స్పూన్ల ధనియాలు, పది లవంగాలు, ఎనిమిది ఏలకులు, దాల్చినచెక్క రెండు అంగుళాల ముక్క, స్టార్ లవంగం ఒకటి, పాపీ సీడ్స్ రెండు టీ స్పూన్లు తీసుకుని పొడిచేయాలి.



Click it and Unblock the Notifications