Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
కిడ్నీ రాళ్లను ఇట్టే కరిగించే ఉలవలతో టేస్టీ వడలు..తయారీ విధానం ఇదే!
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, తగినంత నీరు తాగకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. అయితే ఉలవలను తరచుగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోయి, పొడిపొడిగా మారి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఉలవలతో కేవలం చారు మాత్రమే కాకుండా ఎంతో రుచికరమైన, కరకరలాడే ఉలవల వడలు కూడా చేసుకోవచ్చు. ఎండల్లో కూడా ఇది శరీరానికి మేలు చేసే బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.

ఉలవల వడలు తయారీకి కావలసిన పదార్థాలు
ఉలవలు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - 3 లేదా 4
అల్లం - ఒక చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 4
కరివేపాకు ఆకులు - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కట్ట
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
మిరియాల పొడి - ఒక టేబుల్ స్పూన్
బియ్యం పిండి - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఉలవల వడలు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు ఉలవలను తీసుకుని, వాటిలో రాళ్లు లేకుండా చూసుకుని శుభ్రంగా రెండుసార్లు కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 8 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల ఉలవలు మెత్తబడి, మిక్సీ పట్టుకోవడం చాలా సులువు అవుతుంది. అంతేకాదు ఇలా నానబెట్టిన ఉలవలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
-ఉలవలు బాగా నానిన తర్వాత, అందులోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఆ ఉలవలను మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే పిండిని మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, కాస్త బరకగా రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బుకోవడం వల్లే వడలు కరకరలాడుతూ, క్రిస్పీగా వస్తాయి. తినేటప్పుడు రుచి అద్భుతంగా ఉంటుంది.
-గ్రైండ్ చేసుకున్న ఉలవల పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసి కలపాలి. ఆ తర్వాత జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వడలు విడిపోకుండా, మరింత క్రిస్పీగా రావడానికి ఇందులో కొద్దిగా బియ్యం పిండిని కూడా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని, కలుపుకున్న పిండిని గుండ్రంగా వడల్లా ఒత్తుకోవాలి. వాటి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసి, కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేయాలి.
-ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాలేలా ఫ్రై చేసుకోవాలి. అంతే రుచికరమైన ఉలవల వడలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications