Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
వేసవిలో బరువు తగ్గాలా? అయితే మజ్జిగలో ఈ చిన్న పొడి కలిపి తాగితే, మీ పొట్టలోని కొవ్వు మంచులా కరిగిపోతుంది!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య అధిక బరువు. బరువు తగ్గాలని రకరకాల డైట్లు, వ్యాయామాలు చేస్తుంటారు. కానీ అది అనుకున్నంత సులువు కాదు, అదొక పెద్ద సాహసయాత్ర లాంటిది. అందులోనూ ఇప్పుడున్న మండు వేసవిలో బరువు తగ్గడం అంటే మరింత కష్టమైన పని అని చెప్పాలి.

బయట ఎండల తీవ్రత చూస్తుంటే ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడానికే భయంగా ఉంటుంది. ఇక జిమ్ కి వెళ్లి గంటల తరబడి చెమటోడ్చి వ్యాయామం చేయడం అంటే చాలా మందికి బద్ధకంగా అనిపిస్తుంది. అయితే కఠినమైన వ్యాయామాలు చేయకుండా, కడుపు మాడ్చుకోకుండా కేవలం మనం రోజూ తాగే ఓ చల్లని పానీయంతో వేసవిలో బరువు సులభంగా తగ్గవచ్చని మీకు తెలుసా? అదే వేసవిలో మనందరికీ అమృతం లాంటి మజ్జిగ.
వేసవి తాపం తీర్చుకోవడానికి మనలో చాలా మంది ప్రతిరోజూ మజ్జిగ తాగుతుంటారు. ఈ చిన్న అలవాటే మీ బరువును అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అయితే మెరుగైన ఫలితాల కోసం దీనికి ఒక చిన్న చిట్కా జోడించాలి. అదేంటంటే.. మజ్జిగలో మెంతులు లేదా మెంతి పొడి కలిపి తాగడం.
చలికాలం, వర్షాకాలంలో కాస్త బరువు తగ్గిన వారు కూడా వేసవి వచ్చే సరికి మళ్లీ బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయే మొండి కొవ్వు ఎంత ప్రయత్నించినా కరగదు. అలాంటి వారికి మజ్జిగ, మెంతుల మిశ్రమం ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

మజ్జిగ ఎందుకు తాగాలి?
కొంతమంది మజ్జిగలో వెన్న లేదా మీగడ ఉంటుందని, అది తాగితే బరువు పెరుగుతామనే అపోహతో ఉంటారు. కానీ అందులో అస్సలు నిజం లేదు. పాలతో పోలిస్తే మజ్జిగలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 100 మిల్లీలీటర్ల మజ్జిగ ద్వారా మన శరీరానికి కేవలం 40 కేలరీల శక్తి మాత్రమే అందుతుంది.
మజ్జిగలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యంగా మజ్జిగలోని ప్రోబయోటిక్స్(మంచి బ్యాక్టీరియా) మన పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేసి, శరీరంలోని మలినాలను (టాక్సిన్స్) బయటకు పంపడంలో మజ్జిగ అద్భుతంగా సహాయపడుతుంది. ఇది పరోక్షంగా పొట్ట కొవ్వు కరగడానికి దారి తీస్తుంది.
మెంతులతో రెట్టింపు ప్రయోజనం
ఇక మెంతుల విషయానికి వస్తే..బరువు తగ్గించడంలో, శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో మెంతుల పాత్ర ఎనలేనిది. మెంతులలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించి, అతిగా తినకుండా అడ్డుకుంటుంది.
ఎలా తీసుకోవాలి?
రాత్రి పూట ఒక చెంచా మెంతులను నీటిలో నానబెట్టండి. ఉదయం ఆ మెంతులను ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగండి. లేదా మెంతులను వేయించి పొడి చేసి, ఆ పొడిని అర చెంచా చొప్పున మజ్జిగలో కలుపుకుని కూడా తాగవచ్చు. రుచి కోసం కాస్త వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు కలుపుకుంటే ఫలితం మరింత అద్భుతంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
