Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
చికెన్-బేబీ పొటాటో రిసిపి- వింటర్ స్పెషల్
వింటర్ సీజన్ లో దొరకన వెజిటేబుల్ అంటూ ఉండదు. ఎందుకంటే, వింటర్లో అన్ని రకాల వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ వింటర్ వెజిటేబుల్స్ చలికి రుచితో పాటు, ఆరోగ్యాన్ని కూడా అంధిస్తాయి. వింటర్ సీజన్ లో అన్ని రకాల వెజిటేబుల్స్ తో పాటు, బేబీ పొటాటో కూడా అందుబాటులో ఉంటుంది. వింటర్ సీజన్ శరీరం కాస్త వెచ్చగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. వాటిలో ఒకటి చికెన్. చికెన్ అత్యధిక ప్రోటీలను అంధిస్తుంది, శరీరాన్ని వెచ్చగా ఉంచుంతుంది. కాబట్టి, వింటర్ లో అధికంగా దొరికే బేబీ పొటాటో, చికెన్ కాంబినేషన్ లో తయారుచేసే రిసిపి ఇటు ఆరోగ్యాన్ని అటు రుచికి ప్రత్యేకం.
ఈ చికెన్ విత్ బేబీ పొటాటో తయారుచేయడం చాలా సులభం. మరియు టేస్ట్ కూడా అద్భుంతంగా ఉంటుంది. ఎక్కువ మసాలా దినుసులు లేకుండా అతి తక్కువగా ఉపయోగించి , చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా తయారుచేయవచ్చు. మరి ఈ బేబీ పొటాటో చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావలసిన పదార్థాలు:
చికెన్ : 1/2kg
బేబీ పొటాటో(బంగాళదుంప చిన్నవి): 4
ఉల్లిపాయలు : 2
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2tbps
పచ్చి కొబ్బరి : కొద్దిగా
గరం మసాలా : 1tsp
కరివేపాకు : రెండు రెబ్బలు
కారం : 2tbps
పసుపు : 1/4tps
ఉప్పు : రుచికి తగినంత
కొత్తిమీర : ఒక కట్ట
నూనె : సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బేబీ పొటాటోను ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వత మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
3. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి సరిపడా నూనె వేసి, వేడయ్యాక అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ గుజ్జు వేసి పచ్చివాసన పోయే వరకూ బాగా వేగించాలి.
4. తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి కొద్దిగా వేగనివ్వాలి.
5. ఇప్పడు అందులోనే చికెన్ కూడా వేసి పదినిమిషాలు ఉడకనివ్వాలి.
6. చికెన్ ముక్కలు బాగా మెత్తగా ఉడికాకిన తర్వాత అందులో ముందుగా ఉడికించి పెట్టుకొన్న బేబీ పొటాటో కూడ వేసి ఉడికించాలి.
7. దించే ముందు కొత్తిమీర తురుము వేయాలి. ఈ కూర రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. అంతే బేబీ పొటాటో చికెన్ మసాలా రెడీ.



Click it and Unblock the Notifications