చిల్లీ గార్లిక్ ప్రాన్ కబాబ్: రంజాన్ స్పెషల్

ప్రాన్ కాబాబ్స్ అంత విరివిగా తయారు చేసుకొనే వంటకం కాదు. కానీ మీరు గ్రిల్డ్ ప్రాన్స్, లేదా తందూరి ప్రాన్స్ వినే ఉంటారు. అయితే ప్రాన్ కబాబ్ కాన్సప్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా తయారు చేయడంలో చాలా ఉత్సాహం ఉంటుంది. దాంతో పాటు కొత్తరుచిని వెంటనే చూడాలని ఆత్రుత కూడా ఉంటుంది. ఈ రంజాన్ సమయంలో అటువంటి కొత్త రుచి ఒకటి ప్రయత్నిస్తే బాగుంటుందనుకొనే వారికి మాంసంకు బదులుగా ప్రాన్స్ ను ఉపయోగించుకోవచ్చు.

ప్రాన్స్ తో చిల్లీ గార్లిక్ కబాబ్ తయారు చేయవచ్చు. చిల్లీ గార్లిక్ తో తయారు చేసే వంటలు చాలా రకాలు మీకు తెలిసి ఉండవచ్చు. అయితే ప్రాన్ కాంబినేషన్ లో తయారు చేస్తే కొత్త రుచి ఎలా ఉంటుందో మీరు రుచి చూడాంటే దీన్ని ప్రయత్నించాల్సిందే...

 Prawn Kebabs

కావల్సిన పదార్థాలు:
ప్రాన్స్: 20
నిమ్మరసం: 2tbsp
పచ్చిమిరపకాయలు: 5(మద్యకు సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 6(ముక్కలుగా చేసుకోవాలి)
పెప్పర్ పౌడర్: 1/2tsp
గరం మసాలా: 1tsp
ఉల్లిపాయ: 2 (cubed)
కాప్సికమ్: 1 ( diced)
టమోటాలు: 2 (diced)
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్ ను నిమ్మరసం మరియు ఉప్పు మిశ్రమంతో మ్యారినేట్ చేసి పది నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత నిమ్మరసంతో మ్యారినేట్ చేసిన ప్రాన్ కు పచ్చిమిర్చి, వెల్లులి పేస్ట్ ను అప్లై చేయాలి.
3. తర్వాత దాని మీద కొంచెం గరం మసాలా మరియు పెప్పర్ పౌడర్ మిక్స్ చేసి, మ్యారినేట్ చేసిన ప్రాన్స్ మీద చికలరించాలి. తర్వాత వీటిని పది నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు 200డిగ్రీల్లో మైక్రోవోవెన్ ను సెట్ చేసుకోవాలి.
5. తర్వాత స్టీక్స్ కు పెద్దసైజులో ముక్కలుగా కట్ చేసుకొన్న క్యాప్సికమ్, టమోటో, మరియు ఉల్లిపాయ ముక్కలను గుచ్చుకోవాలి.
6. తర్వాత వాటి మీద కొద్దిగా ఆయిల్ చిలకరించాలి. తర్వాత వీటిని మైక్రోవోవెన్ లో ఫిక్స్ చేయాలి.
7. తర్వాత బయటకు తీసి వాటికి మద్యమద్యల్లో మసాలాతో మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ను గుచ్చి, తిరగి మైక్రోవోవెన్ లో పెట్టి పది నిముషాలకు 60పవర్ ను సెట్ చేసి పెట్టి, బేక్ చేసుకోవాలి.
8. అంతే ప్రాన్స్ ఉడికిన లేదా పూర్తిగా కాలిన తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి బయటకు తీసి, సలాడ్ తో సర్వ్ చేయాలి. అంతే చిల్లీ గార్లిక్ ప్రాన్ కబాబ్ రెడీ.

Story first published: Monday, July 29, 2013, 17:31 [IST]
Desktop Bottom Promotion