Latest Updates
-
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
నోరూరించే మటన్ కిచిడి

మటన్: 1/2kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
బియ్యం: 2cups
నూనె: 1cup
పచ్చిమిర్చి: 4-6
ఉల్లిపాయలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
టమాట పేస్ట్: 2tbsp
గరం మసాల: 2tbsp
నిమ్మరసం: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రం చేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ లోకి నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమంలో మూడు గంటల పాటు నానబెట్టాలి.
2. మూడు గంటల తర్వాత రెండు కప్పుల బియ్యాన్ని శుభ్రం చేసి నాలుగు కప్పుల నీళ్ళు, కొద్దిగా ఉప్పువేసి ఉడికించి అన్నం వార్చి పెట్టుకోవాలి.
3. తర్వాత అరకప్పు నీళ్ళు కుక్కర్ లో పోసి ఆ నీరు పూర్తిగా ఇమిరిపోయే వరకు మటన్ ను ఉడికించాలి.
4. తర్వాత సపరేట్ పాన్ స్టౌ మీద ఉంచి నూనె పోసి మటన్ ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. ఒక బౌల్ లోనికి తీసుకోవాలి.
5. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి.
6. వెంటనే టమోటో గుజ్జు అందులో వేసి తక్కువ మంట మీద వేయించాలి. రెండు నిమిషాల తర్వాత మటన్ కూడా వేసి కొద్ది సేపు వేగనివ్వాలి. ఇందులో అన్నం కలిపి రెండు నిమిషాలు వేడిచేయాలి. ఏదైనా పచ్చడి, లేదా రైతా సర్వ్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications