కోడి గుడ్డు రొయ్యల కర్రీ

Egg and Prawn Curry
కావలసిన పదార్ధాలు:
రొయ్యలు: 1/2kg
గుడ్లు: 4
కొత్తిమీర: 2 కట్టలు
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
పసుపు: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 2 tsp
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి: 4
టమోటో పేస్ట్: 2 tbsp
కొబ్బరి పేస్ట్ లేక కొబ్బరి నీరు: ఒక కప్పు

తయారు చేయు విధానం:
1. ముందుగా రొయ్యలు బాగా ఉప్పువేసి కడిగి శుభ్రపరుచుకోవాలి.
2. తరువాత నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించాలి.
3. తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, టమోటో పేస్ట్, బాగా దోరగా వేయించాలి. ఆతరువాత రొయ్యలు వేసి వేయించాలి.
4. వేగి న తరువాత కారం, పసుసు, ఉప్పు వేసి వేగిన తరువాత చిన్న గ్లాసు నీళ్ళు వేసి ఉడికించాలి.
5. ఉడుకుతూ ఉండగా అందులో గుడ్లు కొట్టి పోయాలి. తరువాత మొ త్తం కలిపి, కొద్దిగా ఉడకనివ్వాలి కర్రీ చిక్కబడే సమయంలో కొబ్బరి పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు కర్రీ చిక్కబడుతూ నూనె బాగా పైకి వచ్చేవరకు వేయించి దించే ముందు కొత్తిమీర వెయ్యాలి. దీనిని వేడివేడిగా సర్వ్ చేయాలి. అంతే ఎగ్ ఫ్రాన్ కర్రీ రెడీ.

Story first published: Tuesday, June 29, 2010, 14:23 [IST]
Desktop Bottom Promotion