Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
పప్పుల పొడి బోర్ కొట్టిందా? అయితే ఈ ఘాటైన ఆంధ్రా చికెన్ కారప్పొడి ట్రై చేయండి!
ఆంధ్రా వంటకాలు అంటేనే గుర్తొచ్చేది ఘాటైన రుచులు, నోరూరించే కారప్పొడులు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, కారప్పొడి కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు. అయితే ఎప్పుడూ తినే పప్పుల కారప్పొడి, కరివేపాకు కారప్పొడి కాకుండా కాస్త వెరైటీగా, నాన్ వెజ్ ప్రియుల కోసం అద్భుతమైన ఆంధ్రా స్టైల్ చికెన్ కారప్పొడి ట్రై చేయండి. ఈ అద్భుతమైన వంటకాన్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే, ముద్ద ముద్దలోనూ చికెన్ రుచి తగులుతూ మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్ - 175-200 గ్రాములు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 10- 15
ఎండు మిరపకాయలు - 6 నుండి 8
కరివేపాకు -4 రెమ్మలు
ఉప్పు - మీ రుచికి సరిపడా
గరం మసాలా - 1 టీస్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్
పసుపు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
ఆంధ్రా స్టైల్ చికెన్ కారప్పొడి తయారీ విధానం
-ముందుగా చికెన్ బ్రెస్ట్ ముక్కను శుభ్రంగా కడిగి, చిన్న చిన్న క్యూబ్స్ లా (ముక్కలుగా) కట్ చేసుకోవాలి. ఈ ముక్కలకు కొద్దిగా పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. పసుపు చికెన్ లోని నీచు వాసనను పోగొట్టి మంచి రంగును ఇస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు ఇలా ఒక్కో దాన్ని విడివిడిగా నూనెలో దోరగా, క్రిస్పీగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అదే నూనెలో పసుపు పట్టించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి, అవి బాగా వేగి లోపల మెత్తగా, బయట క్రిస్పీగా మారేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. వేయించిన ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను చేత్తో చిన్న చిన్న పోగుల్లా విడదీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని, అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బరకగా పౌడర్ చేసుకోవాలి.
-ఆ బరక మిశ్రమంలో ముందుగా ష్రెడ్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ చికెన్ ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరోసారి బరకగా మిక్సీ పట్టుకోవాలి. గుర్తుంచుకోండి, మెత్తటి పేస్ట్ లా చేయకూడదు. చికెన్ ముక్కలు, మసాలాలు కలిసేలా కచ్చాపచ్చాగా మాత్రమే ఉండాలి. అప్పుడే తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే గుమగుమలాడే చికెన్ కారప్పొడి రెడీ.
-ప్లేట్ లో ఆవిర్లు కక్కే వేడి వేడి అన్నం వడ్డించుకుని, అందులో రెండు చెంచాల ఈ చికెన్ కారప్పొడి కలుపుకుని, పైనుండి కాస్త కరిగించిన నెయ్యి వేసుకుని తింటే... ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications