Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
ఫిష్ ఫిల్లెట్- టొమాటో కులిస్

బోన్ లెస్ ఫిష్ ఫిల్లెట్: 1/2kg
వెన్న: 1cup
నిమ్మరసం: 1tsp
వాము: 2tsp
మిరియాల పొడి: 1tsp
పాప్‌రికా: 1tsp(డ్రై క్యాప్సికంతో చేసిన పొడి. మార్కెట్‌లో దొరుకుతుంది)
టొమాటో కులిస్: 2cup
ఆలు: 2(పొట్టు తీసి ఉడకపెట్టి మెత్తగా చిదమాలి)
టొమాటో కులిస్‌కి కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయ తరుగు: 1cup
వెల్లుల్లిపాయ: 1
పంచదార: 1/2cup
పుదీనా ఆకులు: తగినన్ని
టొమాటో ముక్కలు(తొక్కతీసినవి): 2cups
ఉప్పు: చిటికెడు
నూనె: 2tsp
మిరియాల పొడి: చిటికెడు
1.ముందుగా టొమాటో కులిస్ ఎలా తయారు చేయాలో చూద్దాం:
1. పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించాలి. తర్వాత తొక్కుతీసిన టొమాటో ముక్కలు వేసి సన్నటి మంట మీద రెండు నిమిషాలు ఉడికించి పెట్టుకోవాలి.
2. ఈ మిశ్రమం చల్లారాక పంచదార, పుదీనా ఆకులు, ఉప్పు, మిరియాల పొడి వేసి అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి.
ఇప్పుడు స్నాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం...:
1. ముందుగా ఫిలెట్ బోన్ లేస్ చేపను పలచని స్లైస్ లుగా కట్ చేసుకుని శుభ్రపరచాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి సగం కప్పు వెన్న వేసి తక్కువ సెగమీద ఉంచాలి. అందులో వాము, పాప్‌రికా, నిమ్మరసం, మిరియాల పొడి వేసి అయిదు నిమిషాలపాటు తిప్పి పక్కన ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
3. ఇప్పుడు అందులో పైన కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను గిన్నెలోకి తీసి పెట్టుకున్న మిశ్రమంలో ముంచి పాన్ మీద వేయాలి. చేప ముక్కలను గోల్డన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన ఉంచాలి.
4. తర్వాత పక్కన వేరొక పాన్ లో మిగిలిన వెన్న వేసి చిదిమిన ఆలు మిశ్రమాన్ని అయిదారు నిమిషాలు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
5. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో టొమాటో మిశ్రమం వేసి పైన వేయించిన చేప ముక్క, తగినంత ఆలు మిశ్రమం, తిరిగి కాస్త టొమాటో మిశ్రమం, ఇంకో చేప ముక్కని పైన పెట్టి ఆ పైన కొబ్బరి తురుము, వేయించిన ఆలు తురుముతో గార్నిష్ చేయాలి. ఫిలెట్ ఫిష్ కులిస్ రెడీ. ఈ కులిస్ భోజనానికి ముందు స్టార్టర్స్‌లా చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications