Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
గార్లిక్ చికెన్ గ్రేవీ: డైటర్స్ స్పెషల్
గార్లిక్ మరియు చికెన్ కాంబినేషన్ ఒక కాంటినెంటల్ స్పెషల్ రిసిపి. గార్లిక్ ఫ్లేవర్ చికెన్ కు ఒక మంచి కాంబినేషన్. గార్లిక్ చికెన్ వివిధ రకాలుగా వండుతారు. గార్లిక్ చికెన్ రిసిపి చాలా సావరీగా ఉంటుంది. ప్రస్తుత రోజులు వెరైటీగా వంటలు తయారుచేసుకోవడానికి చాలా మంది ఎక్కువ సమయాన్ని గడపడం లేదు. కాబట్టి, చాలా త్వరగా తయారయ్యే వంటల్లోనే, ఆరోగ్యకరమైనవి మనకు చాలా అవసరం అవుతుంది. కాబట్టి, ఈ గార్లిక్ చికెన్ కర్రీ చాలా త్వరగా తయారవుతుంది.
మీరు బరువు తగ్గాలనుకుంటే, ఈ గార్లిక్ చికెన్ రిసిపి మీకు ఎక్స్లెంట్ గా పనిచేస్తుంది . ఇది లోఫ్యాట్ చికెన్ రిసిపి. కాబట్టి, ఈ గార్లిక్ చికెన్ రిసిపిని మీరు ఇంట్లో ట్రై చేయవచ్చు. ఈ ప్రోటీన్ రిచ్ డైట్ ను ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ముఖ్యంగా బిజీ వర్కింగ్ ఉమెన్స్ కు ఇది ఒక ఉత్తమ డైట్ రిసిపి...

చికెన్ బ్రెస్ట్ పీసెస్: 4
చికెన్ లెగ్ పీస్: 4
వెల్లుల్లి రెబ్బలు: 10
వెల్లుల్లి రెబ్బలు: 10(కచ్చపచ దంచుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4(మద్యలోకి కట్ చేయాలి)
బెల్ పెప్పర్: 1 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పెప్పర్: 1tbsp
లోఫ్యాట్ పెరుగు: 1cup
పుదీనా: 2 కొమ్మలు(సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు: కొద్దిగా(సన్నగా తరిగినవి)
ఆయిల్: 1tbsp
నిమ్మకాయ: 1
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం :
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి.
2. నూనె వేడయ్యాక అందులో వెల్లుల్లిపాయలు వేసి, ఒకటి రెండు నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
3. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
4. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారుతున్న సమయంలో అందులో ఉల్లిపాయాలు, కచాపచా దంచి పెట్టుకొన్ని ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించుకోవాలి. మంటను చాలా తక్కువగా పెట్టుకోవాలి.
5. చికెన్ మొత్తంను 5-10నిముషాలు వేగించిన తర్వాత అందులో నిమ్మరసం మరియు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి .
6. తర్వాత అందులో పెప్పర్, కొత్తిమీర మరియు పుదీనా తరుగు వేసి మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి.
7. తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసి బాగా మిక్స్ చేయాలి.
8. తర్వాత రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అడ్జెస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరో 10నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే గార్లిక్ చికెన్ రిసిపి రెడీ. ఈ గార్లిక్ చికెన్ రిసిపిని బ్రెడ్ లేదా బ్రౌన్ రైస్ తో వండిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications