Latest Updates
-
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు!
గార్లిక్ చికెన్ టేస్టీ అండ్ ఈజీ
చికెన్ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ చాలా ఇష్టమైన ఆహారం. చికెన్ చాలా సింపుల్ వంటకాలుగా కూడా తయారుచేసేస్తుంటారు. అతి కొద్ది మసాలా దినుసలుతోటే తయారుచేస్తుంటారు. అలాతయారుచేసే చికెన్ వంటల్లో గార్లిక్ చికెన్ కూడా ఒకటి . రుచికరంగా ఉండే ఈ గార్లిక్ చికెన్ మంచి ఫ్లేవర్ కలిగి నోరూరిస్తుంటుంది .
ఈ గార్లిక్ చికెన్ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు. చాలా సులభంగా అతి తక్కువ సమయంలో తయారయ్యే ఈ గార్లిక్ చికెన్ ను మీరు కూడా టేస్ట్ చూడాలనుకుంటే తయారుచేసే పద్దతిని ఫాలో అవ్వండి...

కావల్సిన పదార్థాలు:
చికెన్ థైస్ లేదా చికెన్ బ్రెస్ట్ : 1kg
వెల్లుల్లి రెబ్బలు: 6(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
డ్రైడ్ థైమ్(వామ్ము): 3tsp
ఆలివ్ ఆయిల్: 3tbsp
నిమ్మరసం: 1పండు
గ్రిల్ సీసనింగ్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
చికెన్ బ్రోత్: 1/2cup
తయారుచేయు విధానం:
1. ముందుగా ఓవెన్ 450డిగ్రీలకు ప్రీహీట్ చేయాలి. తర్వాత చికెన్ ముక్కలను బేకింగ్ లేదా రోస్టింగ్ పాన్ లో పెట్టాలి.
2. చికెన్ ముక్కల మీద ఆలివ్ ఆయిల్. గ్రిల్ సీజనింగ్ మరియు థైమ్(వామ్ము)ను చిలకరించాలి.
3. తర్వాత గార్లిక్ పేస్ట్ ను కూడా చికెన్ ముక్కల మీద అప్లై చేయాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి అరగంట ఓవెన్ లో బేక్ చేయాలి.
4. తర్వాత అందులో చికెన్ బ్రోత్ మరియు నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తిరిగి ఓవెన్ లో పెటి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
5. ఓవెన్ ఆఫ్ చేసిన తర్వాత మరో 5నిముషాలు అలాగే ఓవెన్ లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి సర్వ్ చేయాలి అంతే గార్లిక్ చికెన్ విత్ థైమ్ రెడీ.



Click it and Unblock the Notifications