Latest Updates
-
మాతృ దినోత్సవం రోజున భార్య, అమ్మ మధ్య నలిగిపోతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గొడవలు ఉండవు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు, పీరియడ్స్‌లో ఉన్న మహిళలు ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే! -
విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారా? ఏపీ హైకోర్టు తీసుకున్న ఈ కొత్త నిర్ణయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది! -
ఎండలు మండుతున్నాయి.. అకస్మాత్తుగా పిడుగులు పడతాయా? మీ కుటుంబం కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మీ భోజనం రుచిని రెట్టింపు చేసే సీక్రెట్ పచ్చిమిర్చి పచ్చడి..అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా?
నోరూరించే చికెన్ మెకరోనీ
Non Veg
oi-Pratapreddy
By Pratap

ఉడికించిన పాస్టా రెండున్నర కప్పులు, బొన్లెస్ చికెన్ అరకప్పు, వెల్లుల్లి తురుము టీ స్పూన్, టొమాటో గుజ్జు 2 కప్పులు, మిరియాల పొడి అరటీ స్పూను, జాజికాయ పొడి అర టీ స్పూను, కారం అర టీస్పూను, యాలకుల పొడి అర టీస్పూను, యాలకులు మూడు, గరం మసాలా టేబుల్ స్పూను, క్యాప్సికమ్ ఒకటి, నూనె రెండు టీ స్పూనులు, వెన్న రెండు టీస్పూనులు, ఉప్పు సరిపడినంత
తయారు చేసే విధానం:
1. తగినన్ని నీళ్లలో టీ స్పూను నూనె వేసి పాస్టాని ఉడికించి తీయాలి. తర్వాత చల్లని నీళ్లలో కడిగి వాటి మీద ఓ టేబులు స్పూను నూనె చల్లి పక్కన పెట్టాలి.
2. పాత్రలో రెండు టీ స్పూన్ల నూనె, వెన్న వేసి కాగపెట్టాలి. ఆ తర్వాత వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. సన్నగా కోసిన చికెన్ ముక్కలు వేసి కాసేపు వేయించాలి. ఆ ముక్కల పచ్చి వాసన తగ్గిన తర్వాత టొమాటో గుజ్జు, ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి, కారం, యాలకుల పొడి వేసి బాగా కలిపి సిమ్‌లో ఉడకపెట్టాలి. తర్వాత గరం మసాలా వేసి మరికాసేపు ఉడికించాలి. చికెన్ ఉడికి మంచి వాసన వస్తున్న సమయంలో ఉడికించిన మెకరోనీ వేసి కలిపి సిమ్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. దాన్ని దించి క్యాప్సికమ్ ముక్కలతో అలంకరించాలి.
Comments
English summary
How to prepare Chicken Macaroni | నోరూరించే చికెన్ మెకరోనీ
Story first published: Tuesday, July 12, 2011, 16:12 [IST]
Other articles published on Jul 12, 2011



Click it and Unblock the Notifications