Latest Updates
-
నేటి శని దృష్టి: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్త.. గ్రహాల హెచ్చరిక ఇదే! -
మేషం, ధనుస్సు, సింహ రాశుల వారికి అద్భుతమైన యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 06 మే 2026 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా!
హైదరాబాదీ ఫిష్ బిర్యానీ

బోన్‌లెస్ చేప ముక్కలు: 500grm
పెరుగు: 1cup
నిమ్మకాయ: 1
నిమ్మరసం: 2tsp
ఉల్లిపాయ తరుగు: 1cup(వేయించినది)
నూనె: 1 cup
కొత్తిమీర తరుగు: కట్ట
పుదీనా తరుగు: కట్ట
పచ్చిమిర్చి: 10 (నిలువుగా తరగాలి)
గరం మసాలా: 2tsp
కారం: 2tsp
పసుపు: 1/2tsp
బాస్మతీ రైస్: 1/2kg
కెవ్రా వాటర్: 1tsp
నెయ్యి: 2tsp
డాల్డా: 2tsp
బిర్యానీ ఆకు: 2
జాజికాయ పొడి: 1tsp
ఏలుకల పొడి: 1/2tsp
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4
రోజ్ వాటర్: 1tsp
అల్లం తరుము: 2tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
తయారు చేయు విధానము:
1. చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు పెరుగు నిమ్మరసం పసుపు కారం గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి లవంగాలు దాల్చిన చెక్క జాజికాయ పొడి బిర్యాని ఆకులు కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి.
4. అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్ లో ఉడికిన అన్నం కొంచం చేప మిశ్రమం కొంచం డాల్డా నెయ్యి కుంకుమపువ్వు రోజ్ వాటర్ కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి.
5. తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు కొత్తిమీర నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications