Latest Updates
-
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
ఇటీవల జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయంలో నాయకుల రాజకీయ వాగ్దానాలు, నినాదాల కంటే ఝల్ మురి గురించే ఎక్కువగా చర్చ జరిగింది. సాక్షాత్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం బెంగాల్ వీధుల్లో ఈ ఝల్‌మురిని ఎంతో ఇష్టంగా రుచి చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. అంతేకాదు సోమవారం విడుదలైన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లకు బదులుగా ఈ ఝల్ మురిని తింటూ సంబరాలు చేసుకోవడం విశేషం.

బెంగాలీ సంస్కృతిలో ఝల్ మురికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. బెంగాల్ వీధుల్లో అడుగడుగునా కనిపించే ఈ కరకరలాడే ఝల్ మురి కేవలం రుచికరమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నోరూరించే అసలైన బెంగాలీ ఝల్ మురిని మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
బెంగాలీ ఝల్ మురి తయారీకి కావాల్సిన పదార్థాలు
-మరమరాలు
-ఉల్లిపాయ
-టమాటో
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-బంగాళదుంప
-వేయించిన శనగలు
-పల్లీలు
-సన్నటి కారప్పూస(సేవ్)
-ఆవనూనె
-ఉప్పు
-కారం

బెంగాలీ ఝల్ మురి తయారీ విధానం
-ఝల్‌మురి రుచిగా ఉండాలంటే అందులో వాడే మరమరాలు (బొరుగులు) కరకరలాడుతూ ఉండాలి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న మరమరాలు గాలి తగిలి మెత్తబడిపోయినట్లు అనిపిస్తే, స్టవ్ మీద ఒక మందపాటి బాణలి పెట్టి, సన్నని మంట మీద వాటిని రెండు నిమిషాల పాటు దోరగా వేయించండి. ఇలా చేయడం వల్ల అవి తిరిగి కరకరలాడేలా ఉంటాయి.
-ఈ స్నాక్ ప్రాణం అంతా మనం వాడే కూరగాయల ముక్కల్లోనే ఉంది. ఒక ఉల్లిపాయ, ఒక పండిన టమాటో, రెండు పచ్చిమిర్చి తీసుకుని వాటిని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఒక బంగాళదుంపను మెత్తగా ఉడికించి చిన్న ముక్కలుగా కోసుకోండి. కొద్దిగా తాజా కొత్తిమీరను కూడా తరిగి పెట్టుకోవాలి. వేయించిన శనగలు (పుట్నాలు), వేయించిన పల్లీలు (వేరుశెనగ గుళ్లు), మీకు ఇష్టమైతే కొద్దిగా సన్నటి కారప్పూస (సేవ్) సిద్ధం చేసుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో కరకరలాడే మరమరాలను వేయండి. ఇందులోనే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, బంగాళదుంప ముక్కలు, పల్లీలు, శనగలు అన్నీ వేసి బాగా కలపండి. దీనికి తగినంత ఉప్పు, కొద్దిగా కారం, కాస్త చాట్ మసాలా చల్లండి.
-ఇక్కడ అసలైన బెంగాలీ రహస్యం ఒకటుంది. అదే పచ్చి ఆవనూనె. ఈ ఝల్ మురిలో ఒక చెంచా పచ్చి ఆవనూనె కలపడం వల్లే ఆ ఘుమఘుమలాడే పక్కా బెంగాలీ ఫ్లేవర్ బయటకు వస్తుంది.
-చివరగా కొద్దిగా పుల్లటి రుచి కోసం సగం నిమ్మచెక్క రసాన్ని పిండండి. మసాలాలు, ఆవనూనె, నిమ్మరసం ప్రతి మరమరానికి బాగా పట్టేలా అన్నింటినీ బాగా కలపండి. పైన కొత్తిమీర, కారప్పూస చల్లుకుంటే ఎంతో రుచికరమైన బెంగాలీ స్టైల్ ఝల్ మురి రెడీ.
-ఝల్ మురి తయారు చేసిన వెంటనే క్షణాల్లో తినేయాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచితే మరమరాలు మెత్తబడిపోయి వాటి అసలైన కరకరలాడే రుచిని కోల్పోతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
