Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
ఖీమా సాగ్ స్పెషల్ సైడ్ డిష్: రంజాన్
రంజాన్ నెలలో ఉపవాసాలు చేయడం ముస్లీము యొక్క ఆచారం. అంటే ఒక నెలపాటు , కఠినంగా రోజంతా ఉపవాసం ఉండటం వల్ల, టైమ్ కు ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరంలో క్యాలరీలన్నీ కరిగిపోతాయి. దాంతో ఎసిడిటి సమస్య, మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఉపవాసం ఉండే వారు, ఉపవాసం విరమించిన తర్వాత తీసుకొనే ఆహారం రుచికరంగాను మరియు హెల్తీగాను ఉండేలా చూసుకోవాలి.
రుచికరమైన ఆహారాలు ఎంత ముఖ్యమో, వాటిలో న్యూట్రీషియన్ వాల్యూస్ కూడా అంతే ముఖ్యం. అందుకే రంజాన్ సీజన్ లో ఖీమా రిసిపిలకు అంత ప్రత్యేకత ఉంటుంది. ఖీమాతో ఖీమా సాగ్ రిసిపిని తయారుచేస్తారు. దీన్ని ఆకుకూరతో తయారుచేయడం వల్ల ఇది ఆరోగ్యానికి అవసరం అయ్యే పోషకాలను పూర్తిగా అందిస్తుంది. ఖీమా సాగ్ రిసిపిని తయారుచేయడానికి మటన్ ఖీమాను ఉపయోగించడం జరిగింది . ఈ డిష్ ను చాలా సులభంగా తయారుచేయవచ్చు మరియు ఇందులో హెల్తీ వెజిటేబుల్స్ ను జోడించవచ్చు . ఇటువంటి హెల్తీ డిష్ ను ఈ ఇఫ్తార్ స్పెషల్ విందుగా మీరు ఆరగించి ఎంజాయ్ చేయవచ్చు.

కావల్సిన పదార్థాలు:
మటన్ ఖీమా-750 గ్రాముల
బచ్చలికూర(ఆకుకూర): 3కట్టలు(సన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి: 4 (సన్నగా తరిగినవి)
టమోటో గుజ్జు: 2tbsp
నిమ్మరసం: 2tbsp
బిర్యాని ఆకు: 1
మిరియాలు: 10 పొడిచేసుకోవాలి
కారం పొడి: 1tsp
జీలకర్ర పొడి: 2tsp
ధనియాల పొడి: 2tsp
గరం మసాలా పొడి: 2tsp
కొత్తిమీర: 2 కాడలు (సన్నగా తరగాలి)
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3tbsp శాతం
తయారు చేయు విధానం:
1. ముందుగా కీమాను నిమ్మరసం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు , ధనియాలపొడి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మొత్తం మిశ్రమాలన్నింటితో కీమాను మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. ఇలా మిక్స్ చేసిన కీమా కనీసం 30 పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, పెప్పర్ పొడి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరక వేగించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ కు మారగానే , మ్యారినేట్ చేసిన కీమాను పాన్ లో వేసి 5నమిుషాలు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. ఖీమా ఫ్రై అవుతూ నూనె తేలుతున్నప్పుడు అందులో టమోటో గుజ్జు మరియు పచ్చిమిర్చి వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత ఇందులో ఆకుకూర తరుగు కూడా వేసి మిక్స్ చేస్తూఉడికించాలి. తర్వాత అందులో ఉప్పు వేసి మూత పెట్టి, 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
7. పది నిముషాల తర్వాత మూత తీసి గరం మసాలా మరియు కొత్తిమీర తరుగు వేసి మరో నిముషం ఫ్రై చేయాలి అంతే రుచికరమైన ఖీమా సాగ్ రెడీ . ఇది రోటీ, రైస్ కు బెస్ట్ కాంబినేషన్. ఈ రుచికరమైన సైడ్ ను ఇప్తార్ కు ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications