మటన్ బగరా రైస్

Mutton Bagara Rice
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం: 1/2kg
మటన్: 1/2kg
గరం మసాల: 50grms
యాలకులు: 25grms
షాజీర: 25grms
దాల్చిన చెక్క: 25grms
లవంగాలు: 25grms
ఉప్పు : రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
పచ్చిమిర్చి పేస్ట్: 2tsp
నిమ్మకాయ: 1
నూనె : తగినంత
నెయ్యి: 4tsp

తయారు చేయు విధానము:
1. బియ్యాన్ని కడిగి నానబెట్టాలి.
2. మటన్ ను శుభ్రం చేసి ఉల్లిపాయ ముక్కలు, మిర్చి పొడి, కొద్దిగా నిమ్మరసం, ఏలకులు, షాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి వేసి కలిపి ఉంచాలిః.
3. అరగంట తర్వాత పెరుగు, కొత్తిమీర, పుదీన వేసి ఉడికించాలి. పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన వుంచాలి.
4. ఇప్పుడు మరొక పాత్రలో నూనె వేసి కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, గరం మసాలా పొడి వేసి కలియబెట్టాలి. నాలుగు కప్పుల నీరు పోసి మరిగాక బియ్యం వేసి ఉడికించాలి. అన్నం పలుకుగా ఉండగానే వార్చాలి. ఇందులో ముందుగా ఉడికించి ఉంచిన మటన్, కుంకుమపువ్వు కలిపిన పాలు వేసి కలిపి పైన నెయ్యి వేయాలి, అంతే మటన్ బగరా రైస్ రెడీ.

Story first published: Thursday, November 11, 2010, 14:10 [IST]
Desktop Bottom Promotion