Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే..
మన భారతీయ వంటగదిలోనే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయన్న సంగతి మనలో చాలామందికి తెలియదు. అలాంటి ఒక అద్భుతమైన, ఎవరికీ పెద్దగా తెలియని రహస్యమే అలివ్ గింజలు. వీటిని హలీమ్ గింజలు అని కూడా పిలుస్తారు. ఐరన్, విటమిన్లు, ప్రోటీన్ల కలయిక అయిన ఈ గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. జుట్టు రాలడం ఆగిపోయి, చర్మం ఎంతో కాంతివంతంగా, మృదువుగా మారే అవకావాలు ఉంటాయి. ఈ లడ్డూలను ఇంట్లోనే చాలా సులభంగా, బేసిక్ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు.

అలివ్ గింజలు - ముప్పావు కప్పు
కొబ్బరి నీళ్లు - 1 కప్పు
నెయ్యి - పావు కప్పు
బెల్లం తురుము -ఒకటిన్నర కప్పులు
సన్నగా తరిగిన బాదం- 1/3 కప్పు
ఎండు కొబ్బరి తురుము -అర కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
అలివ్ లడ్డూ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో అలివ్ గింజలను తీసుకుని, అందులో కొబ్బరి నీళ్లు పోసి బాగా కలపాలి. వీటిని కనీసం అరగంట పాటు అలాగే నానబెట్టుకోవాలి. గింజలు నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, అందులో నెయ్యి వేడి చేయాలి. నెయ్యి కరిగాక బెల్లం తురుము వేసి, చిన్న మంట మీద బెల్లం పూర్తిగా కరిగే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి.
-బెల్లం కరిగిన తర్వాత, ముందుగా కొబ్బరి నీళ్లలో నానబెట్టుకున్న
అలివ్ గింజలను అందులో వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
చివరగా సన్నగా తరిగిన బాదం పప్పులు, ఎండు కొబ్బరి తురుము, మంచి సువాసన
కోసం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా దగ్గరపడి, పాన్
అంచుల నుండి విడిపోతున్నప్పుడు (ముద్దలా మారుతున్నప్పుడు) స్టవ్ ఆఫ్
చేయాలి.
-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారితే
గట్టిపడిపోతాయి.
రెండు చేతుల అరచేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, గుండ్రంగా లడ్డూలు
చుట్టుకోండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యాన్నిచ్చే అలివ్ లడ్డూలు రెడీ. రోజుకో లడ్డూ తినడం అలవాటు చేసుకోండి. మీ జుట్టు, చర్మ సౌందర్యం మెరుగుపడటమే కాకుండా మీలో రక్తహీనత తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications