Latest Updates
-
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం -
సింహరాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆత్మవిశ్వాసం రెట్టింపు కాబోతోంది! -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. శని దేవుని అనుగ్రహం ఎవరికి? - శనివారం, 20 జూన్ 2026 -
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది?
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే..
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే ఈ సమయంలో మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. ఎండాకాలంలో లభించే మామిడిపండు కోసం ఏడాదంతా ఎదురుచూసేవాళ్లు బోలెడు మంది. ఎర్రటి ఎండల్లో యెల్లో కలర్ లో మెరిసిపోయే తీయటి మామిడి ముక్కలు తింటుంటే ఆ మజాయే వేరు. కానీ చాలామందికి ఉండే ఒక డౌటు ఏంటంటే..మామిడిపండు రాత్రి పూట తినొచ్చా? భోజనం చేశాక తినాలా? లేక ఖాళీ కడుపుతోనా?. అయితే మీరు మామిడిపండు తినాలనుకుంటే సరైన టైం ఏదో ఇక్కడ చూడండి.

మామిడిలో ఏముంటుంది?
ఒక కప్పు పచ్చి మామిడి ముక్కల్లో 99 కేలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు (సుమారు 23 గ్రాముల సహజ చక్కెర), 3 గ్రాముల ఫైబర్ ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 51 మాత్రమే. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా పెంచుతుంది. ఇందులో విటమిన్-c, విటమిన్-A, ఫోలేట్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మామిడి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఒక ఆరోగ్య నిధి.
తినడానికి సరైన సమయం ఏది?
పోషకాహార నిపుణుల ప్రకారం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనానికి మధ్య ఉన్న సమయంలో (మిడ్ మార్నింగ్ స్నాక్) మామిడిపండు తినడం అత్యంత ఉత్తమం. రోజులో ఈ సమయంలో మన జీవక్రియలు వేగంగా ఉంటాయి. కాబట్టి పండులోని పోషకాలు, సహజ చక్కెరలను శరీరం సులభంగా జీర్ణం చేసుకుని తక్షణ శక్తిని ఇస్తుంది.
మధ్యాహ్నం, రాత్రి భోజనానికి మధ్యలో కూడా స్నాక్ లా దీన్ని తీసుకోవచ్చు. కానీ కడుపునిండా భారీగా భోజనం చేశాక మాత్రం దీన్ని తినకూడదు. అలా తింటే ఆహారంలోని కార్బోహైడ్రేట్లకు పండులోని చక్కెరలు తోడై క్యాలరీలు పరిమితి మించుతాయి.
రాత్రిపూట ఎందుకు
చాలామంది చేసే అతిపెద్ద తప్పు రాత్రిపూట మామిడిపండు తినడం. నిద్రపోయే ముందు దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధి, ప్రీ డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. రాత్రిపూట మన శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అదనపు కేలరీలు ఖర్చుకాకుండా కొవ్వుగా మారిపోతాయి. అంతేకాదు ఇది శరీరానికి ఎక్కువ శక్తిని ఇచ్చి, మీ ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications