Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు!
భారతీయ వంటకాలలో, ప్రత్యేకించి మన దక్షిణ భారతీయ భోజనంలో చట్నీలకు ఉండే స్థానమే వేరు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని చట్నీతో తింటే ఆ మజాయే వేరు. పుదీనా, కొత్తిమీర, టమాటా, కొబ్బరి, చింతపండు.. ఇలా ఎన్నో రకాల పచ్చళ్లను మనం రోజూ ఆస్వాదిస్తుంటాం. ప్రతి చట్నీకి దానికంటూ ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా కరకరలాడే బెండకాయ చట్నీ రుచి చూశారా? రోటీ, పరాఠా లేదా పప్పు అన్నంలోకి నంజుకోవడానికి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.

బెండకాయ చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
లేత బెండకాయలు - 250 గ్రాములు
ఉల్లిపాయ - 1
వెల్లుల్లి రెబ్బలు - 6
పచ్చిమిర్చి - 2
టమాటా - 1
కారం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఆమ్చూర్ పొడి లేదా నిమ్మరసం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
పోపు కోసం: ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ
కరివేపాకు - 6 ఆకులు
బెండకాయ చట్నీ తయారీ విధానం
-ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి బట్టతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి. వాటిలో తడి అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత వాటిని సన్నగా, పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి లేకపోతేనే బెండకాయలు కరకరలాడుతూ వస్తాయి.
-కడాయిలో నూనె వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన బెండకాయ ముక్కలను వేసి, మీడియం మంటపై దోరగా వేయించండి. ముక్కలు బంగారు రంగులోకి మారి కరకరలాడేలా తయారయ్యాక, అదనపు నూనెను పీల్చుకోవడానికి వాటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి.
-వేరొక పాన్ లో 1-2 టీస్పూన్ల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడించండి. తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కాస్త వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మెత్తబడేదాకా ఉడికించండి. ఆపై పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. మసాలా పచ్చివాసన పోయి నూనె పైకి తేలుతున్నప్పుడు, అందులో ఆమ్చూర్ పొడి వేసి కలపాలి. మంటను పూర్తిగా సిమ్ లో పెట్టి, ముందుగా వేయించి పెట్టుకున్న కరకరలాడే బెండకాయ ముక్కలను ఈ మసాలాలో వేయండి. ముక్కలు విరిగిపోకుండా చాలా సున్నితంగా కలుపుతూ, మసాలా అంతా పట్టేలా 1-2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే కరకరలాడే బెండకాయ చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
