Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
మటన్ సాగ్వాలా: డిఫరెంట్ మటన్ కర్రీ
డార్క్ గ్రీన్ మటన్ గ్రేవీని సాగ్వాలా అంటారు. గ్రీన్ లీఫ్స్ ఉపయోగించి తయారుచేసే, ఈ మటన్ రిసిపి చాలా టేస్టీగా ఉంటుంది. గ్రీన్ లీఫ్ హెల్తీ కూడా. గ్రీన్ లీఫ్ జోడించడం వల్ల గ్రేవీ చిక్కగా మరియు గ్రీన్ కలర్ లో నోరూరిస్తూ క్రీమీగా ఉంటుంది.
ఈ గ్రీన్ మటన్ గ్రేవీకి ఫ్రెష్ క్రీమ్ చేర్చడంతో మరింత టేస్ట్ గా మరియు క్రీమి స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఈ రిసిపిని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ మసాలా దినుసులతో చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ హెల్తీ గ్రీన్ మటన్ క్రీమీ గ్రేవీ రిసిపిని టేస్ట్ చేయాలంటే ఒక సారి ట్రై చేయండి.

కావల్సిన పదార్థాలు:
మటన్: 500 గ్రాముల (మధ్య స్థాయి ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఆకుకూర: 500 గ్రాముల
ఉల్లిపాయలు 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
వెల్లుల్లి: 5
టొమాటోస్: 1 (తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3
పెరుగు(యోగర్ట్): 2tbsp
ఫ్రెష్ క్రీమ్: 1tbsp
ఎండిన మెంతిఆకులు: 1tbsp
ఇంగువ: ఒక చిటికెడు
కారం: 1tsp
గరం మసాలా: 1tsp
బే ఆకు: 1
ఆయిల్: 2tbsp
నెయ్యి: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో కొద్దిగా నూనె వేసి, వేడయ్యాక అందులో ఇంగువ, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి మరియు మటన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీడియం మంట మీద మటన్ 5నిముషాలు ఉడకనివ్వాలి.
3. అంతలోపు, ఆకు కూరను శుభ్రంగా కడిగి కొద్దిగా నీళ్ళు పోసి రెండు, మూడు నిముషాలు ఉడికించి పెట్టుకోవాలి. ఓవర్ గా ఉడికించకండి, మీడియంగా ఉండికించుకోవాలి.
4. తర్వాత ఈ కూరాకులోని నీరు వంపేసి, మిక్సీ జార్ లో వేసి, పచ్చిమిర్చి జతచేసి రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ లో టమోటోలను వేసి కొద్దిగా ఉప్పు చిలకరించి 5నిముషాలు మొత్తగా వేగించుకోవాలి.
5. టమోటో మెత్తగా ఉడుతున్నప్పుడు, అందులో కారం, మరియు ఎండిన మెంతి ఆకులు వేసి మరో రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో రెండు కప్పులు నీరు పోసి మూత పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
7. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకొని, కుక్కర్ లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత గరం మసాలా, నెయ్యి, మరియు తాజా క్రీమ్ ను వేసి మిక్స్ చేయాలి . అంతే మటన్ మేతి రిసిపి రెడీ .



Click it and Unblock the Notifications