Latest Updates
-
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఇన్స్టాగ్రామ్లో మీ పిల్లలు సేఫేనా? హనీట్రాప్ ముఠాల వలలో పడకుండా కాపాడుకోండిలా! -
సహజీవనం తర్వాత విడిపోతే అత్యాచారమా? సుప్రీంకోర్టు తీర్పుతో షాకింగ్ నిజాలు! -
భార్యను భర్తకు దూరంగా ఉండాలట! ఫ్యామిలీ కోర్టు వింత తీర్పుపై హైకోర్టు షాకింగ్ రియాక్షన్ -
పసుపు, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..ఆ సమస్యకు కూడా ఇదే పవర్ ఫుల్ మెడిసిన్! -
హైదరాబాద్లో వాతావరణం మారుతోంది! గర్భిణులు, పసిబిడ్డల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
నాటుకోడి పులుసా మజాకా...!

నాటుకోడి మాంసం: 1/2kg
ఉల్లిపాయలు: 3
పచ్చిమిరపకాయలు: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbs
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
పసుపు: 1/2tsp
పెరుగు: 1/2cup
కొబ్బరి పొడి: 3tbsp
కారం: 1tsp
ధనియాలపొడి: 1tsp
కొత్తిమీర తరుగు: 1cup
తయారు చేయు విధానం:
1. ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక పెద్ద పాన్లో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి.
3. ఇప్పుడు కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తర్వాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి.
4. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ.
స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం. వేడి వేడి అన్నం, సంగటి కాంబినేషన్ లో రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.



Click it and Unblock the Notifications