సాల్మన్ ఫిష్ డ్రై ఫ్రై విత్ కోకొనట్ ఆయిల్

వీకెండ్ లో సీఫుడ్ తయారుచేసుకుంటే ఎలా ఉంటుంది. అద్భుతమైన టేస్ట్ తో వీకెండ్ ఎంజాయ్ చేయాల్సిందే. సాల్మన్ చేపలతో తయారుచేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. గ్రేవీగా కాకుండా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సీఫుడ్స్ చాలా పాపులర్ అయినటువంటి ఫిష్ సాల్మన్. ఇది అద్భుతమైన రుచి అంధించడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలను కూడా అందిస్తుంది. సాల్మన్ చేపలు బెటర్ ఐ సైట్, మజిల్స్, గుండె, చర్మం మరియు కేశాలకు అద్భుతమైన ప్రయోజనాలను చేకూర్చుతుంది.

ఇక్కడ సాల్మన్ ఫిష్ తో తయారుచేసే ఒక అద్బుతమైన, చాలా సులభమైన వంటను అందిస్తున్నాం. దీన్ని పాన్ ఫ్రైడ్ సాల్మన్ ఫిష్ అంటారు. దీన్ని కొబ్బరి నూనెతో తయారుచేస్తారు. ఈ రిసిపిని తయారుచేయడం చాలా సులభం. మరియు దీన్ని తయారుచేయడానికి అంత టైమ్ కూడా పట్టడు. మరి ఈ స్పెషల్ సాల్మన్ ఫిష్ ఫ్రై విత్ కోకోనట్ ఆయిల్ తో ఎలా తయారుచేయాలో చూద్దాం...

Pan Fried Salmon In Coconut Oil

కావల్సిన పదార్థాలు:
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tsp
కారం: 2tsp
మిరియాల పొడి: 1/2tsp
పసుపు: 1/4tsp
గరం మసాలా: 1tsp
జీలకర్ర పొడి: 1/2tsp
నిమ్మరసం: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా

పాన్ లో ఫ్రై చేయడానికి కావల్సినవి:
కొబ్బరినూనె: 3-4tbsp
పందన్ లీవ్స్, కట్ చేసినవి: ఒక గుప్పెడు
కరివేపాకు: 3రెమ్మలు

తయారుచేయు విధానం:
1. ముందుగా సాల్మన్ చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాత మ్యారిషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటిని ఒక చిన్న బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి చేపముక్కలకు పట్టించి అరగంట నుండి ఒక గంట పాటు అలా ఉంచాలి.
2. తర్వాత నాన్ స్టిక్ ఫ్రై పాన్ మీడియం హీట్ మీద వేడి చేసి అందులో కొబ్బరి నూనె వేసి కాగనివ్వాలి, తర్వాత అందులో పాందన్ లీవ్స్ మరియు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న సాల్మన్ చేపలను వేయాలి. వేసిన తర్వాత మంటను మీడియంగా పెట్టి రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి.
5. ఇలా రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొన్న తర్వాత పాన్ ను తీసి, పేపర్ టవల్ మీద వేయాలి. నూనె మొత్తం పేపర్ టవల్ పీల్చుకొన్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.

చిట్కా: సాల్మన్ చేప మంచి టేస్ట్ గా ఉండాలంటే కొబ్బరినూనెతో తయారుచేయండి. అలాగే ఆలీవ్ ఆయిల్ లేదా వెజిటేబుల్ ఆయిల్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.
మంచి సువాసన కోసం పందన్ లీవ్స్ లేదా కరివేపాకును వేయడం వల్ల ఒక మంచి సువాసన వస్తుంది.

Story first published: Tuesday, November 5, 2013, 11:31 [IST]
Desktop Bottom Promotion