Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
ప్రాన్స్ ఫ్రైడ్ రైస్

రొయ్యలు: 1 kg
బియ్యం: 1 kg
నెయ్యి: 1 tbsp
ఉల్లిపాయ పేస్ట్: 1 tbsp
బఠానీలు: 100 grm
అల్లం వెల్లుల్లి: 2 tbsp
పచ్చిమిర్చి: 6
కారం: 1 tsp
కొత్తిమీర: రెండు కట్టలు
లవంగాలు: 8
చెక్క: 8
సాజీర: 1 tsp
యాలకులు: 6
కరివేపాకు: ఒక రెబ్బ
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: చిటికెడు
తయారు చేయు విధానము:
1. ముందుగా బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకోవాలి. బఠానీలు ముందు రోజు నానబెట్టుకోవాలి. అలాగే రొయ్యల్ని కూడా పొట్టు తీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి.
2. లవంగాలు, దాల్చిన చెక్క, సాజీర మూడింటిని కలిపి మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి.
3. స్టౌ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి బాగా కాగాక ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి.
4. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలియ బెట్టాలి. తర్వాత రొయ్యలు కూడా వేసి బాగా వేయించాలి. వేగాక దించేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
5. స్టౌ పై వెడల్పాటి గిన్నె పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వేడయ్యాక అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే కడిగి ఆరబెట్టుకొన్న బియ్యాన్ని, బఠానీల్ని వేసి వేయించాలి.
6. బాగా వేగాక మసాల పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి గరిటతో బాగా కలపాలి. ఇప్పుడు గ్లాసు బియ్యంకు గ్లాసున్నర నీరు పోసి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత దింపుకొని కొత్తిమిరతో గార్నిష్ రెడీ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications