సాస్ తో రొయ్యల కట్‌లెట్‌ టేస్టీ

Prawns Cutlet
కావలసిన పదార్థాలు:
చిన్న రొయ్యలు: 150grms
శనగపిండి: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్టు: 1tsp
ఉల్లిపాయ: 1
పసుపు: 1/2tsp
కారం: 1/2tsp
గరం మసాలా పొడి: 1/2tsp
కొత్తిమీర: చిన్న కట్ట
నిమ్మరసం: 1/2tsp
ఉప్పు: రుచికి తగినంత
బియ్యం పిండి: 1/2tsp
నూనె: వేయించడానికి సరిపడినంత
తయారు చేయు విధానం:
1. పొట్టుతీసి శుభ్రపరచిన రొయ్యలకు ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
2. తర్వాత ఉల్లిపాయ కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాలా పొడి, శనగ పిండితోపాటు రొయ్యల్ని కూడా వేసి ముద్దులా తయారుచేసుకోవాలి.
3. ఇప్పుడు దీన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. తర్వాత ఒక్కో ముద్దని వడలా వత్తుకుని రెండు వైపులా బియ్యం పిండిలో ముంచి, నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడివేడిగా టోమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా వుంటాయి.

Story first published: Thursday, April 28, 2011, 16:45 [IST]
Desktop Bottom Promotion