Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరిగేకొద్దీ మన శరీరంపై, ముఖ్యంగా రక్తపోటుపై(BP) తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వేసవిలో బీపీ తగ్గుతుందని భావిస్తారు. కానీ ఒక్కోసారి అది అకస్మాత్తుగా పెరిగి ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఎండల నుంచి గుండెను, రక్తపోటును ఎలా కాపాడుకోవాలో ఇక్కడ చూడండి.

వేడితో బీపీకి ఉన్న లింక్ ఏంటి?
మన శరీరాన్ని ఎప్పటికప్పుడు చల్లబరచడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ఈ కింది మార్పులు జరుగుతాయి.
డీహైడ్రేషన్
ఎండలో విపరీతంగా చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు, ముఖ్యమైన లవణాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్తంలో ద్రవాల పరిమాణం తగ్గిపోయి, బీపీ అమాంతం పడిపోతుంది. కళ్లు తిరగడం, నీరసం రావడానికి ప్రధాన కారణం ఇదే.
నరాలు వ్యాకోచించడం
వేడి నుంచి ఉపశమనం కోసం శరీరంలోని రక్తనాళాలు వెడల్పుగా మారుతాయి. దీనివల్ల కూడా రక్తపోటు తగ్గుముఖం పడుతుంది.
గుండెపై భారం
శరీరాన్ని చల్లబరిచే ప్రక్రియలో అన్ని అవయవాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె మామూలు కంటే చాలా వేగంగా కొట్టుకోవాల్సి వస్తుంది. ఇది గుండెపై అదనపు ఒత్తిడిని పెంచుతుంది.
హార్మోన్ల ఒత్తిడి
తీవ్రమైన వేడి వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఒక్కసారిగా విడుదలై, కొన్నిసార్లు బీపీ అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది. అందుకే వేసవిలో లో బీపీ, హై బీపీ రెండూ కనిపిస్తుంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు
బీపీ తగ్గితే: విపరీతమైన నీరసం, తల తిరగడం, అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి.
బీపీ పెరిగితే: ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, కళ్లు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రెండింటిలో ఏది జరిగినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
వేసవిలో బీపీని ఎలా కంట్రోల్ చేయాలి?
-బాగా నీళ్లు తాగుతూ ఉండండి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటే శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతినదు.

-కాటన్ తో చేసిన లేత రంగు, వదులైన దుస్తులు ధరించండి. మధ్యాహ్నం అత్యంత వేడిగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ఫ్యాన్లు, కూలర్లు వాడుతూ శరీరాన్ని చల్లగా ఉంచుకోండి.
-ఎండలో భారీ వ్యాయామాలు, కష్టమైన పనులు చేయవద్దు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే వాకింగ్ లేదా వ్యాయామం చేయండి.
-వేసవిలో పుచ్చకాయ లాంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు బాగా తినండి. అత్యంత ముఖ్యమైన విషయం.. ఆహారంలో ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించండి. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది.
-టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటివి శరీరంలో ఉన్న నీటిని లాగేసి డీహైడ్రేషన్ ను మరింత పెంచుతాయి. కాబట్టి వేసవిలో వీటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
