Latest Updates
-
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే
రాజస్థానీ ఖీమా బిర్యానీ

బాస్మతి బియ్యం: 350grms
మటన్ ఖీమా: 400grms
నెయ్యి: 100grms
చికెన్ స్టాక్ : 1cup(చికెన్, కూరగాయలు, ఉప్పు, మిరియాలు కలిపి ఉడికించిన గుజ్జు)
పెరుగు: 3tsp
ఉల్లిపాయ: 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
కారం : 1tsp
నిమ్మరసం: 2tsp
లవంగాలు: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. మొదటగా ఉప్పు కలిపిన నీటిలో బియ్యాన్ని హాఫ్ బాయిల్ చేయాలి. నీరు వంపేసి సంగం ఉడికిన అన్నాన్ని అలాగే ప్రక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత వేరే గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి సగం వేగాక మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి దోరగా వేయించాలి.
3. తర్వాత ఖీమ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పదినిమిషాల తర్వాత పెరుగు, కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాలు వేయించాలి. ఖీమా బాగా వేగిన తర్వాత దించేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అందులో సగభాగం అన్నాన్ని వేసి పైన ఖీమా వేసి నిమ్మరసం పిండాలి. ఆ పైన మరికొంచెం అన్నాన్ని వేసి కొంచెం ఖీమా వెయ్యాలి. ఇలాగే అన్నాన్ని ఖీమాను పొరలుగా వేసుకోవాలి. చివరగా పైన అన్నం వచ్చేలా చూసుకోవాలి.
5. ఆపైన చికెన్ స్టాక్ ను కూడా పొరలా వేసి మూత పెట్టాలి తక్కువ మంట మీద అరగంట ఉడికించుకుని దించేసుకోవాలి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమిర, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొంటే సరి. అంతే రాజస్థానీ ఖీమా బిర్యానీ రెడీ.



Click it and Unblock the Notifications