Latest Updates
-
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు!
మీల్స్..బ్రేక్ ఫాస్ట్ దేనికైనా రెడీ..రోల్డ్ ఆమ్లెట్
ఉదయం తీసుకొనే అల్పాహారం ఆరోజంతటికి చాలా ముఖ్యమైనది. ఎందకంటే ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీనులు, న్యూట్రిషయన్ అంది, ఆరోజంతటికి మనకు కావల్సిన శక్తినందిస్తుంది. దాంతో మనం ఉత్సాహంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అందుకే ఉదయం తయారుచేసే బ్రేక్ ఫాస్ట్ రిసిలు వివిధ రకాలుగా..వివిధ వెరైటీలు ఉన్నాయి. అదేవిధంగా, బ్రెడ్ మరయు గుడ్డు రెండు ప్రతి ఇంట్లోనూ డామినేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా బ్యాచులర్ గా లేదా ఒక్కరే ఉండే వారి ఇల్లల్లో చాలా సందర్బాల్లో బ్రెడ్ మరయు ఆమ్లెట్టే. దీన్ని సాదారణంగా తయారు చేసి వంటకాదు, వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరం మరియు కడుపు నిండుగా ఉంటుంది. గుడ్డులో అనేక న్యూట్రీషియన్స్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి. కాబట్టే అవి ఉదయం తీసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ఆరోగ్యకరం.
ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో వెరైటీల్లో ఆమ్లెట్స్ లో చాలా రకాలున్నాయి. మీకు ఆఫీసుకు ఆలస్యం అయిందంటే కొన్ని స్పైసీలను(ఉప్పు, రెడ్ చిల్లీ,బ్లాక్ పెప్పర్) ఉపయోగించి ఆమ్లెట్ తయారు చేసేస్తుంటారు . అదేవిధంగా, కొన్ని వెజిటేబుల్స్ (ఉల్లిపాయ, టమోటో, స్ప్రింగ్ బీన్స్,) మిక్స్ చేసుకొని , హెల్తీ మరియు కడుపు నిండేట్లుగా ఒక ఆమ్లెట్ రిసిపిని తయారు చేసుకోండి. చాలా రుచిగానూ..ఆరోగ్యానికి ఆరోగ్యకరంగాను ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. బ్రేక్ ఫాస్ట్ రిసిపి తయారు చేసేసుకోండి. రోజూ చేసుకునే ఒకే రకమైన ఆమ్లెట్ల బదులు..ఇదిగో ఈ వెరైటీ ఆమ్లెట్లను చేస్తారని.... ఇక్కడ ఇస్తున్నాం..

కావలసిన పదార్థాలు:
గుడ్లు: 2
బ్రెడ్ ముక్కలు: 2
బీన్స్ ముక్కలు: 1tbsp
ఉల్లిపాయ ముక్కలు: 1/2cup
పచ్చిమిరపకాయలు: 4 సన్నగా తరిగి పెట్టుకోవాలి
మిరియాల పొడి: 1/2tsp
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా గుడ్డు సొనని మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాల పొడి, పసుపు, ఉప్పు, వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు ఈ బీన్స్ మిశ్రమంలో మిక్సీలో వేసిన గడ్డు సొన వేసి బాగా కలపాలి.
4. తర్వాత స్టౌ మీద పెనం పెట్టి సరిపడా నూనె పోసి పలచగా ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ వేగాక గుండ్రంగా మడవాలి. దీన్ని టమోట సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications