Latest Updates
-
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది?
స్పైసీ పెప్పర్ మటన్ గ్రేవీ రిసిపి
మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన రుచులు మటన్, చికెన్ తో తయారుచేసే వివిధ వెరైటీ వంటకాలు. అంతే కాదు, మాంసాహార ప్రియులు చాలా వరకూ మటన్ వంటకాల మీద కూడా ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. అందులోనూ రెగ్యులర్ టేస్ట్ కు కొంచెం డిఫరెంట్ గా తయారుచేసే వంటలంటే మరింత ప్రీతి. ఇంకా కొంచెం ఘాటుగా టేస్టీ గా తయారుచేస్తే మాంసాహరప్రియులు ఎవరైన సరే, ఆ వంటకు దాసోహం అవ్వాల్సిందే....
ఈ స్పైసీ పెప్పర్ మటన్ గ్రేవీ రిసిపిని బెస్ట్ ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తారు. ఈ స్పైసీ మటన్ రిసిపికి ఇంతటి ఘాటైన సువాసన, మరియు రుచి ఇందులో ఉపయోగించే బ్లాక్ పెప్పర్(నల్ల మిరియాల)వల్లే. ఈ పెప్పర్ గ్రేవీ మటన్ రిసిపిని ఎటువంటి సందర్భంలోనైనా తయారుచేసుకొని తినవచ్చు. మరి మీరు మాంసాహార ప్రియులైతే ఈ వెరైటీ స్పైసీ మటన్ గ్రేవీని ఎలా తయారుచేయాలో చూడండి...

కావల్సిన పదార్థాలు:
మటన్: 1 kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tbsp
గరం మసాలా పొడి: 1tbs
కరివేపాకు: ఒక రెమ్మ
పసుపు: ½tbsp
పచ్చిమిరపకాయలు: 4(మద్యకు కట్ చేసుకోవాలి)
అల్లం తురుము: 1tbsp
ఆవాలు: 1tbsp
పెప్పర్: 3tbsp
ధనియాల పొడి: 1tbsp
అల్లం-వెల్లుల్లి పేస్ట్: ½tbsp
ఆయిల్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా కట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను శుభ్రం చేసి, అందులో కొద్దిగా పసుపు ఉప్పు చేర్చి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. 15నిముషాల తర్వాత, ప్రెజర్ కుక్కర్ లో వేసి, కొద్దిగా నూనె కూడా వేసి వేడయ్యాక అందులో అల్లం, వెల్లుల్లిపేస్ట్ , పసుపు, కారం, ధనియాలా పొడి, ఉప్పు వేసి 5-10బాగా వేగించి, 15నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు మరో పాన్ లీసుకొని అందులో ఒక స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత అందులో ఆవాలు వేసి చిటపటలాడాక, అందులో అల్లం తురుము మరియు పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ లోకి మారేదాక, వేగించుకోవాలి.
4. తర్వాత ఇందులోనే గరం మసాలా మరయిు పెప్పర్ పౌడర్ వేసి తక్కువ మంట మీద వేగించుకోవాలి. తర్వాత కుక్కర్ లో ఉడికించుకొన్న మటన్ మిశ్రమాన్ని ఇందులో పోయాలి.
5. ఈ మొత్తం మిశ్రమాన్ని అతి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. 10 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి. మీకు ఇష్టమైతే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయండి...



Click it and Unblock the Notifications