Latest Updates
-
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది!
థాయ్ సీర్ ఫిష్ కర్రీ-డైటర్స్ స్పెషల్
చేపలు ఆరోగ్యానికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం . వీటిని మనం రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఈ సీఫుడ్స్ లో అనేక ప్రోటీన్స్ , న్యూట్రీషియన్స్ అనేక ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇవి కొన్ని జబ్బులను గుండె, కడుపు, క్యాన్స్ వంటి రోగ్యాలను నయం చేయడానికి సహాయపడుతాయి . చేపలు ఒక ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి మీరు వివిధ రూపాల్లో చేపలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.
మన ఇండియన్ స్టైల్ ఫిష్ కర్రీ కాకుండా కొన్ని ఇతర దేశాల స్టైల్ తో తయారుచేసే వంటలు మన కొత్త రుచులను అంధిస్తాయి. కాబట్టి, ఇప్పుడు మనం థాయ్ స్టైల్లో ఫిష్ కర్రీనీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం . ఈ ఫిష్ కర్రీకీ నూనె ఉపయోగించకుండా తయారుచేయడం వల్ల ఇది బరువు తగ్గాలనుకొనే వారికి చాలా మేలు చేస్తుంది. మరి ఈ థాయ్ సీర్ ఫిష్ కర్రీ ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
షియర్ ఫిష్ : ½ kg
చింతపండు : 10grm(ఒక కప్పు నీటిలో నానబెట్టుకోవాలి)
ఉల్లిపాయ : 2 (చిన్న ముక్కలుగా తరిగి)
అల్లం పేస్ట్: ½tsp
టొమాటోస్ : 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
కొబ్బరి : 1cup(తురిమినది)
పచ్చిమిర్చి : 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి )
పసుపు : చిటికెడు
కారం పొడి : 2tbsp
కరివేపాకు : 2 రెమ్మలు
నీరు : 1 cup
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం :
1. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి, శుభ్రం చేసి పెట్టుకొన్న షీయర్ ఫిష్ వేసుకోవాలి . తర్వాత ఈ ఫిష్ తో పాటు చింతపండు గుజ్జు కూడా వేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
2. తర్వాత మట్టితో తయారుచేసిన పాట్ (కుండను) స్టౌ మీద పెట్టి, మీడియం మంట పెట్టాలి.
3. పాట్ వేడయ్యాక అందులో చింతపండుగుజ్జులో నానబెట్టుకొన్న ఫిష్ , ఉల్లిపాయ, టమోటో ముక్కలు వేయాలి.
4. ఇప్పుడు, ఇవి మట్టి పాత్రలో ఉడకనివ్వాలి. అవి ఉడుకుతున్నట్లే అందులో కొబ్బరి తురుము మరియు పసుపు వేసి, వెడల్పు స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి.
5. పది నిముషాల తర్వాత, అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి మరి కొద్దిసేపు వేగించి తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోయాలి.
6. నీటిలో ఫ్రైయింగ్ పదార్థాలన్ని కలిసేలా మిక్స్ చేసి మరో 5నిముషాలు ఫిష్ కర్రీని ఉడికించుకోవాలి
7. 5నిముషాల తర్వాత అందులో కారం, ఉప్పు, పసుపు వేసి నిధానంగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు అందులో కరివేపాకు ఆకులు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి . మంట పూర్తిగా తగ్గించి 10నిముషాలు ఉడికించుకోవాలి.
9. షీయర్ ఫిష్ పూర్తిగా ఉండికిన తర్వాత అందులో కొత్తమీర తరుగుతో మరియు ఫ్రైడ్ ఆనియన్స్ తో గార్నిష్ చేయాలి.
అంతే థాయ్ సీర్ ఫిష్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కర్రీ కోకోనట్ రైస్ కు చాలా అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications