Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
ఘాటుగా..కారంగా పంజాబీ టమోటో చికెన్ కర్రీ...

చికెన్: 1/2kg
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టామోటాలు: 4(గుజ్జుచేసుకోవాలి)
ధనియాపౌడర్: 2tbsp
కారం: 2tbsp
పసుపు: 1/4tsp
పెరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: తగినంత
కొత్తమిర తరుగు: 1cup
పలావ్ ఆకు: 2
యాలకులు: 2-3
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 4-6
గరం మసాలా పొడి కోసం
యాలకులు: 2
లవంగాలు: 4-6
దాల్చిన చెక్క: చిన్న ముక్క
మిరియాలు: 1tsp
జీలకర్ర: 1tsp
తయారు చేయు విధానం
1. ముందుగా చికెన్ ను శుభ్రం చేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి తరిగిన ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలను వేసి కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు వీటిని పక్కకు తీసి మెత్తని పేస్ట్ లా తయారు చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు ఈ పేస్ట్ లో మసాలా దినుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఉడికించాలి. అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి. తర్వాత టమోటో గుజ్జు వేసి నూనె బయటకు వచ్చే వరకు ఉడికించాలి.
4. తర్వాత అందులో చికెన్ ముక్కలు వేసి మరో పదినిమిషాలపాటు తక్కువ మంటమీద బాగా వేయించి, కొద్దిగా నీళ్ళు పోసి అరగంటపాటు చికెన్ ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు ఉడుకుతున్న కూర మద్యలో గరిటలో సందుచేసి అందులో పెరుగు, పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి వెయ్యాలి. నెమ్మదిగా చికెన్ ముక్కలను అందులో దొర్లించి, చికెన్ మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి. అంతే చివరగా కొత్తమిర తరుగుతో గార్నిష్ చేసి అన్నంతో గానీ, నాన్ తో కానీ సర్వ్ చేయాలి. రుచికరమైన పంజాబీ చికెన్ కర్రీ రెడీ.



Click it and Unblock the Notifications