Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్.. ఎలాగో తెలుసా?
వేడి వేసవి మధ్యాహ్నం వేళ లేదా రాత్రి భోజనం పూర్తయిన తర్వాత చల్లని ఐస్ క్రీమ్ దొరికితే ఎంత హాయిగా ఉంటుందో. అందులోనూ నోరూరించే మామిడి ఐస్ క్రీమ్ దొరికితే ఆ రోజు పరిపూర్ణంగా మారినట్లే. మామిడి పండులోని సహజమైన తీపి, ఐస్ క్రీమ్ క్రీమీదనం కలిస్తే ఆ రుచే వేరు. ఇంట్లోనే అత్యంత రుచికరమైన, మృదువైన మామిడి ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు. ప్రముఖ వంటల నిపుణురాలు, మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా షేర్ చేసిన ఈ సీక్రెట్ రెసిపీతో కేవలం మూడు అంటే మూడే పదార్థాలతో మీరు అద్భుతమైన ఐస్ క్రీమ్ ను తయారు చేసుకోవచ్చు.

మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు
బాగా పండిన, తీయటి పెద్ద మామిడి పండ్లు - 2
విప్పింగ్ క్రీమ్ - 1 కప్పు
కండెన్స్డ్ మిల్క్ - ఒకటిన్నర కప్పులు
మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం
- ముందుగా మామిడి పండ్లను శుభ్రంగా కడగాలి. తొక్క తీసి, లోపల ఉన్న గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు, ఈ గుజ్జును మిక్సీ జార్ లో వేసి ఎక్కడా ముక్కలు లేకుండా మెత్తని ప్యూరీలా బ్లెండ్ చేయండి. మీరు తీసుకున్న మామిడి పండ్లు చిన్నవిగా ఉంటే, ఐస్ క్రీమ్ రుచిని మరింత పెంచడానికి మూడు మామిడి పండ్లను ఉపయోగించడం మంచిది.
-ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో విప్పింగ్ క్రీమ్ పోయండి. ఆ క్రీమ్ ఆకృతి తేలికగా, మృదువుగా, మెత్తగా ఉబ్బే వరకు ఎలక్ట్రిక్ బీటర్ లేదా విస్కర్ సహాయంతో బాగా గిలకొట్టండి.
- ఇప్పుడు అందులో కండెన్స్ డ్ మిల్క్, ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి ప్యూరీని నెమ్మదిగా వేయాలి. ఈ మిశ్రమం మొత్తం నునుపుగా, అత్యంత క్రీమీగా అయ్యే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి.
- ఇప్పుడు, సిద్ధం చేసుకున్న ఈ క్రీమీ మిశ్రమాన్ని ఒక గాలి చొరబడని డబ్బాలో పోయండి. ఐస్ క్రీమ్ తినేటప్పుడు పంటికి తగులుతూ మరింత రుచిని ఇవ్వడానికి.. పైన చిన్న చిన్న మామిడి ముక్కలను చల్లుకోండి. కావాలనుకుంటే స్ట్రాబెర్రీలు లేదా ఇతర బెర్రీలను కూడా అలంకరణ కోసం జోడించవచ్చు. ఇప్పుడు డబ్బా మూత గట్టిగా పెట్టి 8 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచండి.
-ఫ్రిడ్జ్ నుండి డబ్బాను బయటకు తీసి తెరిచి చూస్తే.. నోరూరించే క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
